హాట్ టాపిక్.. RRR రిలీజ్ వేళ ప్రభుత్వానికి RGV ఇంట్రెస్టింటింగ్ అడ్వైజ్

by  |
హాట్ టాపిక్.. RRR రిలీజ్ వేళ ప్రభుత్వానికి RGV ఇంట్రెస్టింటింగ్ అడ్వైజ్
X

దిశ, వెబ్‌డెస్క్ : వివాదాలకు కేరఫ్ అడ్రస్ రాంగోపాల్ వర్మ.. ఎవ్వరేమనుకున్నా.. తనకు నచ్చినట్లు బతకడమే రాంగోపాల్ వర్మ ఫిలాసఫీ. వివాదాలు సృష్టించడంలో, వాటికి వివరణ ఇవ్వడంలో వర్మకు మించిన వారు లేరు అంటారు అభిమానులు. అంతే కాకుండా తనకు ఏది అనిపిస్తే అది చెబుతూ ఉంటాడు. తాజాగా వర్మ సంచలన ట్వీట్ చేశారు. ప్రభుత్వానికి ఓ సలహా ఇవ్వనా అంటూ తనదైన శైలిలో ఆర్.ఆర్.ఆర్ సినిమాను ప్రభుత్వానుద్దేశించి ట్వీట్ చేశారు. అందులో ప్రస్తుతం కొవిడ్ కేసుల సంఖ్య పెరుగుతుంది.. అలాగే ఒమిక్రాన్ విజృంభన కొనసాగుతోంది. అందువలన నేను ప్రభుత్వానకి ఓ సలహా ఇస్తానంటూ.. ట్విట్టర్‌ వేదికగా తెలిపారు.

ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి, మరో వైపు చాలా సినిమాలు విడుదలకు సిద్దంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఒమిక్రాన్ గురించి ప్రభుత్వానికి చెప్పడానికి నా దగ్గర గొప్ప ఆలోచన ఉంది. కరోనా విజృంభన కొనసాగుతున్నా ఇప్పటికిీ చాలా మంది సెకండ్ డోస్ వ్యాక్సిన్ తీసుకోలేదు. అందువలన త్వరలో విడుదల కాబోయే ఆర్.ఆర్. ఆర్ సినిమా చూడటానికి థియేటర్లలోకి డబుల్ డోస్ వ్యాక్సిన్ రుజువు చూసిస్తే తప్ప ఎవరినీ అనుమతించకండి.. RRR చూడాలనే కోరిక ప్రజల అజాగ్రత్తను జయిస్తుంది అంటూ ట్వీట్ చేశారు.


Next Story

Most Viewed