అభిమాని కుటుంబాన్ని ఆదుకున్న చరణ్…

by Shyam |

<p>             మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ తేజ్ ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడంలో ఎప్పుడూ ముందే ఉంటారు. ఓ అభిమాని కుటుంబాన్ని ఆదుకొని చరణ్ తన పెద్ద మనసును చాటుకున్నాడు. గతేడాది డిసెంబర్ 8న గ్రేటర్ హైదరాబాద్ చిరంజీవి యువత అధ్యక్షుడు నూర్ అహ్మద్ ఆకస్మికంగా కన్నుమూయడంతో మెగా ఫ్యామిలీ హీరోలు విషాదంలో మునిగిపోయారు. తమను ఎంతగానో ఆరాధించే అభిమాని చనిపోయిన వార్త తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి హుటాహుటిన నూర్‌ అహ్మద్‌ [&hellip;]</p>

అభిమాని కుటుంబాన్ని ఆదుకున్న చరణ్…
X

మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ తేజ్ ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడంలో ఎప్పుడూ ముందే ఉంటారు. ఓ అభిమాని కుటుంబాన్ని ఆదుకొని చరణ్ తన పెద్ద మనసును చాటుకున్నాడు. గతేడాది డిసెంబర్ 8న గ్రేటర్ హైదరాబాద్ చిరంజీవి యువత అధ్యక్షుడు నూర్ అహ్మద్ ఆకస్మికంగా కన్నుమూయడంతో మెగా ఫ్యామిలీ హీరోలు విషాదంలో మునిగిపోయారు. తమను ఎంతగానో ఆరాధించే అభిమాని చనిపోయిన వార్త తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి హుటాహుటిన నూర్‌ అహ్మద్‌ ఇంటికి వెళ్ళి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అంతేకాదు వారిని ఆర్ధికంగా ఆదుకుంటామని భరోసా కూడా ఇచ్చారు. ఆ తర్వాత మెగా పవన్ స్టార్ రామ్ చరణ్.. ఆ కుటుంబానికి రూ.10 లక్షల ఆర్ధిక సాయం అప్పట్లో ప్రకటించాడు. తాజాగా రామ్ చరణ్.. రూ.10 లక్షల చెక్‌ను ఇటీవలె కన్నుమూసిన నూర్ అహ్మద్ కుటుంబ సభ్యులకు వాళ్ల ఇంటికి పిలిచి అందజేసాడు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన పెద్ద మనసును చాటుకున్నాడు. నూర్ అహ్మద్ మెగా ఫ్యామిలీలో ఏ హీరో పుట్టినరోజైన రక్తదాన శిబిరాలతో పాటు ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహించాడు. ఈ సందర్భంగా చరణ్.. నూర్ అహ్మద్‌తో మెగా కుటుంబానికి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నాడు రామ్ చరణ్. అంతేకాదు ఆయన మా మెగా ఫ్యామిలీకి బ్లడ్ బ్రదర్ అన్నారు. మరోవైపు ఆయన కొడుకుకు మంచి ఉద్యోగం ఇప్పించడంతో పాటు, కూతుళ్లు చదువు, పెళ్లిళ్ల బాధ్యతలను తాను ఇంటి పెద్ద కొడుకుగా స్వీకరిస్తున్నట్టు ఈ సందర్భంగా ప్రకటించడం గమనార్హం.

Next Story