మరో బాలీవుడ్ చాన్స్ కొట్టేసిన రకుల్

by  |
మరో బాలీవుడ్ చాన్స్ కొట్టేసిన రకుల్
X

దిశ, సినిమా: బ్యూటీఫుల్ రకుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్‌లో వరుస ఆఫర్లు కొట్టేస్తోంది. అజయ్ దేవగన్, అమితాబ్ బచ్చన్ కాంబినేషన్‌లో వస్తోన్న ‘మైదాన్‌’లో కీలక పాత్రలో కనిపించబోతున్న రకుల్.. సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి ‘థాంక్ గాడ్‌’లోనూ స్క్రీన్ షేర్ చేసుకోబోతోంది. దీంతో పాటు పలు ప్రాజెక్ట్‌లు పరిశీలనలో ఉండగా.. తాజాగా ఆయుష్మాన్ ఖురానా అప్ కమింగ్ మూవీ ‘డాక్టర్ జి’లో ఫిమేల్ లీడ్ క్యారెక్టర్‌లో కనిపించబోతున్నట్లు ప్రకటించింది. మూవీ స్టోరీ వినగానే లవ్‌లో పడిపోయానని తెలిపిన రకుల్.. ఈ ప్రాజెక్ట్‌లో భాగమయ్యేందుకు ఎగ్జైట్ అవుతున్నట్లు చెప్పింది. క్యాంపస్‌లో సెట్ చేసిన మెడికల్ ప్రొఫెషన్ చుట్టూ కథ ఉంటుందని, ఇందులో ఆయుష్మాన్ సీనియర్‌గా నటిస్తున్నట్లు వెల్లడించింది. ‘డాక్టర్ జి’ చిత్రం చూశాక సమాజంలో వైద్యవృత్తి పట్ల ఉన్న అభిప్రాయం మారుతుందని చెప్పింది. అనుభూతి కశ్యప్ డైరెక్షన్‌లో వస్తున్న సినిమాను జంగిల్ పిక్చర్స్ నిర్మిస్తుండగా.. త్వరలో సెట్స్‌పైకి వెళ్లనుంది.

Next Story

Most Viewed