తను నిప్పులాంటి అమ్మాయి : Rakul preet singh

by  |
తను నిప్పులాంటి అమ్మాయి : Rakul preet singh
X

దిశ, సినిమా : అక్కినేని వారి కోడలు సమంత తన డెబ్యూ సిరీస్ ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’లో ప్లే చేసిన రాజీ పాత్రకు ఊహించని స్పందన లభిస్తోంది. ఈ సిరీస్‌‌లో మనోజ్ బాజ్‌‌‌‌పాయ్, ప్రియమణితో పాటు లీడ్ రోల్స్‌‌లో నటించిన సామ్ (Samantha) .. తన యాక్టింగ్‌తో ప్రతీ ఒక్కరినీ ఆశ్చర్యపరిచింది. ఈ మేరకు ఇండస్ట్రీ వర్గాలు, ప్రేక్షకుల నుంచి కాంప్లిమెంట్స్ అందుతుండగా తాజాగా హీరోయిన్ రకుల్ ప్రీత్ ట్విట్టర్‌‌ వేదికగా సమంతను ప్రశంసల్లో ముంచెత్తడంతో పాటు ‘ఫ్యామిలీ మ్యాన్2’పై తన ఒపీనియన్ పంచుకుంది. యూనిక్ స్టోరీ పాయింట్‌‌‌తో పాటు యాక్టర్స్ పర్ఫార్మెన్స్ టెర్రిఫిక్‌‌గా ఉందన్న రకుల్.. మనోజ్ బాజ్‌‌పాయ్ నటన గురించి చెప్పేందుకు మాటల్లేవని తెలిపింది. సమంతను ఫైర్ గర్ల్‌గా అభివర్ణించిన రకుల్ (Rakul preet singh) రాజీ పాత్రలో తను లీనమైన విధానానికి హ్యాట్సాఫ్ చెప్పింది. ఈ మేరకు మేకర్స్ రాజ్ అండ్ డీకే ఫ్యాన్ అయిపోయానని తెలిపింది.

Next Story