- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అందానికో, అలంకారానికో కాదు : రకుల్
<p>బ్యూటిఫుల్ హీరోయిన్ రకుల్‌ప్రీత్ సింగ్ ప్రతీ విషయాన్ని చాలా నిశితంగా పరిశీలిస్తూ ఉంటుంది. సమస్యలు ఎదురైతే పరిష్కరించుకునే విధానం కూడా భిన్నంగా ఉంటుందని తన మిత్రులు చెబుతుంటారు. ఆరోగ్యంతో పాటు అందాన్ని సొంతం చేసుకున్న రకుల్‌ప్రీత్.. ‘యోగాభ్యాసం వల్లే ఇదంతా సాధ్యమైంది. అంతేకాక యోగా అందానికో లేక అలంకారానికో చేసేది కాదు. మనస్సు పెట్టి చేసే యోగా అద్భుతాలు చేయగలదు’ అని చెబుతోంది. నిజమైన యోగా శరీరాకృతి గురించి కాదు.. మీ జీవితం స్వరూపాన్ని మార్చేందుకని తెలిపింది. […]</p>

బ్యూటిఫుల్ హీరోయిన్ రకుల్‌ప్రీత్ సింగ్ ప్రతీ విషయాన్ని చాలా నిశితంగా పరిశీలిస్తూ ఉంటుంది. సమస్యలు ఎదురైతే పరిష్కరించుకునే విధానం కూడా భిన్నంగా ఉంటుందని తన మిత్రులు చెబుతుంటారు. ఆరోగ్యంతో పాటు అందాన్ని సొంతం చేసుకున్న రకుల్‌ప్రీత్.. ‘యోగాభ్యాసం వల్లే ఇదంతా సాధ్యమైంది. అంతేకాక యోగా అందానికో లేక అలంకారానికో చేసేది కాదు. మనస్సు పెట్టి చేసే యోగా అద్భుతాలు చేయగలదు’ అని చెబుతోంది.
నిజమైన యోగా శరీరాకృతి గురించి కాదు.. మీ జీవితం స్వరూపాన్ని మార్చేందుకని తెలిపింది. అలాగే యోగా అంటే.. మీ కాలి పాదాలను ముట్టుకోవడం కాదు, మీరు క్లిష్టమైన పరిస్థితుల్లో ఎలా ఉండాలో నేర్పేదని అంటోంది రకుల్. ‘మీ నుంచి బయటకు వచ్చేదాన్ని మీరు ఎలాగూ కంట్రోల్ చేయలేరు.. కానీ మీ లోపల ఏం జరగాలో యోగా ద్వారా కంట్రోల్ చేయొచ్చని చెబుతోంది. నిశ్చలత్వంలో మునిగిపోయి శరీరం, మెదడు, ఆత్మను ఏకం చేస్తూ.. అసలు మీరెవరో తెలుసుకుంటూ.. లైఫ్‌ను సెలబ్రేట్ చేసుకోవాలని సూచిస్తోంది. తన లైఫ్‌లో యోగాను భాగం చేసిన అన్షుక యోగాకు యోగా డే సందర్భంగా.. ధన్యవాదాలు తెలిపిన రకుల్.. యోగాను మీ రోజులో భాగం చేసుకుని ఆరోగ్యంగా ఉండాలని కోరింది.
https://www.instagram.com/p/CBrY-wuhkOR/?utm_source=ig_web_copy_link






