రకుల్ చేతిలో‘మందులా’.. ‘మందా’?

by  |
రకుల్ చేతిలో‘మందులా’.. ‘మందా’?
X

దిశ, వెబ్ డెస్క్: లాక్‌డౌన్‌లోనూ మద్యం అమ్మకాలకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దాంతో మందుబాబులు వైన్స్ ల ముందు బారులు తీరారు. ఇప్పటికే వీటికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే… తప్పుడు వార్తలు కూడా సోషల్ మీడియాలో బాగా ప్రచారమవుతున్నాయి. తాజాగా ప్రముఖ సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్ కు సంబంధించిన ఓ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. దాంట్లో రకుల్ మందు బాటిల్స్ తీసుకుపోతుందని ప్రచారం జరుగుతుంది. అసలు ఏం జరిగింది?

ఎప్పుడూ వర్కవుట్లతో బిజీగా గడిపే రకుల్.. మెడిసిన్ కోసం బయటకు వచ్చింది. ముంబైలోని బాంద్రాలో ఉన్న మెడికల్ దుకాణానికి వెళ్లి మందులు తీసుకుంది. ఆ మందు బాటిళ్లను పట్టుకుని రకుల్ రోడ్డు దాటుతున్న వీడియోను ఎవరో నెట్టింట్లో పోస్ట్ చేశారు. దాంతో రకుల్ చేతిలో ఉన్న బాటిల్ చూసి ఆమె కూడా లిక్కర్ కొనుగోలు చేసిందని జోరుగా ప్రచారం సాగుతోంది. దీనిపై రకుల్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మెడికల్ షాపు ఎదురుగా కనిపిస్తున్నప్పటికీ, తప్పుడు ప్రచారం ఎందుకు చేస్తాన్నరంటూ ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా అసలు వీడియోను బయట పెట్టారు. దీంతో అందరికీ క్లారిటీ వచ్చింది. రకుల్ చేతిలో ఉన్నది మందు కాదు.. మందులని అందరికీ అర్థమయ్యింది.

tags: rakul, medicine, bottles, viral video

Next Story