వారికి ‘కంటి రెప్ప’ లాంటి వాడిని అంటున్న పినపాక ఎమ్మెల్యే రేగా..

by Sridhar Babu |   (  Updated:2021-08-22 06:22:57  IST  )

<p>దిశ, మణుగూరు : ఈ సృష్టిలోనే అన్నాచెల్లెళ్ల సంబంధం కోటి తారల అనుబంధం అని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. ఆదివారం ఎమ్మెల్యే రేగా స్వగృహంలో తన చెల్లెళ్లతో కలిసి రాఖీ పండుగను ఘనంగా జరుపుకున్నారు. రేగా చెల్లెళ్లు సునీత, జయలు రేగాకు రాఖీని కట్టి ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. తర్వాత రేగా తన చెల్లెళ్లకు స్వీట్స్ తినిపించి బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా రేగా మాట్లాడుతూ.. అన్నాచెల్లెళ్ల సంబంధం [&hellip;]</p>

mla-rega
X

దిశ, మణుగూరు : ఈ సృష్టిలోనే అన్నాచెల్లెళ్ల సంబంధం కోటి తారల అనుబంధం అని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. ఆదివారం ఎమ్మెల్యే రేగా స్వగృహంలో తన చెల్లెళ్లతో కలిసి రాఖీ పండుగను ఘనంగా జరుపుకున్నారు. రేగా చెల్లెళ్లు సునీత, జయలు రేగాకు రాఖీని కట్టి ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. తర్వాత రేగా తన చెల్లెళ్లకు స్వీట్స్ తినిపించి బహుమతులు అందజేశారు.

ఈ సందర్భంగా రేగా మాట్లాడుతూ.. అన్నాచెల్లెళ్ల సంబంధం కోటి తారల అనుబంధమని, చెల్లెళ్లకు తాను కంటి రెప్ప లాంటి వాడినని చెప్పారు. తన చెల్లెళ్లు ప్రతీ పండుగకు నా ఇంటికి రావాలని, దేవుడిని ప్రతీరోజు కోరుకుంటానని తెలిపారు. వారు కనబడకుండా ఉంటే తట్టుకోలేనని కంటతడి పెట్టారు. తనకు ఎటువంటి బాధ వచ్చిన ముందుగా వారితోనే పంచుకుంటానని తెలిపారు. కొద్ది సేపు మాట్లాడుతే తన గుండెలోని భారం తగ్గిపోతుందని రేగా అన్నారు. చివరగా పినపాక నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

Next Story