'ఆకాశ ఎయిర్' బ్రాండ్ లోగో విడుదల చేసిన కంపెనీ!

by  |
Akasa Air
X

దిశ, వెబ్‌డెస్క్: బిగ్‌బుల్ రాకేష్ ఝున్‌ఝున్‌వాలాకు చెందిన సరికొత్త విమానయాన సంస్థ ఆకాశ ఎయిర్‌కు సంబంధించి ‘రైజింగ్ ఏ’ లోగోతో పాటు ‘ఇట్స్ యువర్ స్కై’ పేరుతో ట్యాగ్‌లైన్‌ను బుధవారం కంపెనీ ఆవిష్కరించింది. తక్కువ ధరలో ప్రయాణమనే ప్రకటనలో వస్తున్న ఈ కంపెనీ సామాజిక, ఆర్థిక విషయాలతో సంబంధం లేకుండా దేశీయంగా అందరూ విమానంలో ప్రయాణించేందుకు అనుకూలమైన సేవలందించనున్నట్టు కంపెనీ తెలిపింది. ఆకాశ ఎయిర్ విమానాలు సురక్షితమైన, సరసమైన ప్రయాణాన్ని వినియోగదారులకు అందిస్తుందని కంపెనీ పేర్కొంది. బుధవారం ప్రకటనలో కంపెనీ తన బ్రాండ్‌కు సంబంధించి సన్‌రైజ్ ఆరెంజ్, పర్పుల్ రంగుల్లో ఉన్న విమానాన్ని ప్రదర్శించింది.

అంతేకాకుండా కంపెనీ తన వ్యవస్థాపక బృందంలో బెల్సన్ కౌటిన్‌హో, ఆనంద్ శ్రీనివాసన్, భవిన్ జోషి, వినయ్ దూబే, నీలు ఖత్రి, సంజయ్ దూబే, ఆదిత్య ఘోష్, నీరజ్ దూబే, ప్రవీణ్ అయ్యర్‌లు ఉన్నారని వెల్లడించింది. వీరిలో వినయ్ దూబే ఎయిర్‌లైన్ వ్యవస్థాపకుడిగానే కాకుండా ఎండీ, సీఈఓగా ఉండనున్నారు. బెల్సన్ కౌటిన్‌హో ఎయిర్‌లైన్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్‌గా, అంకుర్ గోయెల్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్‌గా వ్యవహరించనున్నారు. ప్రవీణ్ అయ్యర్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్‌గా ఉంటారు. ఇండిగో ఎయిర్‌లైన్ మాజీ ప్రెసిడెంట్ ఆదిత్య ఘోష్ ఆకాశ సహ-వ్యవస్థాపకుడుగా ఉన్నారు.


Next Story