ఆమెతోనే ప్రభుదేవా పెళ్లి

by  |
ఆమెతోనే ప్రభుదేవా పెళ్లి
X

దిశ, వెబ్‌డెస్క్: కొరియోగ్రాఫర్, ఫిల్మ్ మేకర్ ప్రభుదేవా మరోసారి పెళ్లి చేసుకున్నారు. ముంబైకి చెందిన డాక్టర్‌ (హిమని)ను వివాహం చేసుకున్నట్లు తన సోదరుడు రాజు సుందరం కన్‌ఫర్మ్ చేశారు. ఓ నేషనల్ టెలివిజన్ ఇంటర్వ్యూలో ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు. మే నెలలో లాక్‌డౌన్‌ టైమ్‌లోనే వీరిద్దరి వివాహం జరిగినట్లు తెలిపారు. ఫిజియోథెరపిస్ట్ హిమని దగ్గర వెన్నెముక, కాళ్ళ నొప్పికి ట్రీట్మెంట్ తీసుకున్న ప్రభుదేవా.. ఈ క్రమంలో తనతో క్లోజ్ అయ్యారని, ఇద్దరూ లవ్ చేసుకుని పెళ్లి చేసుకున్నారని చెప్పారు. మ్యారేజ్‌కు ముందు రెండు నెలల పాటు లివ్ ఇన్ రిలేషన్‌షిప్‌లో కూడా ఉన్నారని, లాక్‌డౌన్ రూల్స్ కారణంగా చెన్నైలో అతికొద్ది మంది కుటుంబ సభ్యుల మధ్య ప్రభుదేవా, హిమని పెళ్లి జరిగినట్లు వెల్లడించారు.

ఇంతకు ముందు రమాలతను పెళ్లి చేసుకున్న 47 ఏళ్ల ప్రభుదేవా ఆమెకు విడాకులిచ్చారు. ఆ తర్వాత లేడీ సూపర్ స్టార్ నయనతారతో కొంతకాలం పాటు రిలేషన్‌లో ఉన్న ఈ స్టార్ కొరియోగ్రాఫర్.. బ్రేకప్ చెప్పిన సంగతి తెలిసిందే. కాగా ఇప్పుడు ‘హిమని’ని పెళ్లి చేసుకోవడంతో హెడ్ లైన్స్‌లోకి వచ్చేశాడు. కాగా ప్రస్తుతం నయన్ డైరెక్టర్ విఘ్నేష్ శివన్‌తో డేటింగ్ చేస్తోంది.



Next Story

Most Viewed