- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాజు ఆత్మహత్య ఎఫెక్ట్.. అడ్డగూడూరులో విషాదం
<p>దిశ, మోత్కూరు: సైదాబాద్ సింగరేణికాలనీ నిందితుడు పల్లకొండ రాజు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం తెలిసిన రాజు బంధువుల ఇళ్లలో విషాదం నిండుకుంది. తాజాగా.. యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరులోని రాజు అక్క ఇంట్లో రోధనలు మిన్నంటాయి. వివరాల్లోకి వెళితే.. అడ్డగూడూరు గ్రామంలో రాజు అక్క నివాసం ఉంటోంది. రాజు హత్యాచారం విషయం వెలుగులోకి రావడంతో నిందితుడి భార్య, అమ్మ అడ్డుగూడూరులోకి అక్క నివాసానికి చేరుకున్నారు. గురువారం ఉదయం ఇంట్లో టీవీ చూస్తుండగా ఒక్కసారిగా జనగామ జిల్లాలోని […]</p>

దిశ, మోత్కూరు: సైదాబాద్ సింగరేణికాలనీ నిందితుడు పల్లకొండ రాజు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం తెలిసిన రాజు బంధువుల ఇళ్లలో విషాదం నిండుకుంది. తాజాగా.. యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరులోని రాజు అక్క ఇంట్లో రోధనలు మిన్నంటాయి. వివరాల్లోకి వెళితే.. అడ్డగూడూరు గ్రామంలో రాజు అక్క నివాసం ఉంటోంది. రాజు హత్యాచారం విషయం వెలుగులోకి రావడంతో నిందితుడి భార్య, అమ్మ అడ్డుగూడూరులోకి అక్క నివాసానికి చేరుకున్నారు. గురువారం ఉదయం ఇంట్లో టీవీ చూస్తుండగా ఒక్కసారిగా జనగామ జిల్లాలోని స్టేషన్‌ఘన్‌పూర్‌లోని రైల్వే ట్రాక్‌పై రాజు ఆత్మహత్య చేసుకున్నట్లు వార్తలు రావడంతో వారి రోధనలు మిన్నంటాయి. స్థానికులు అందరూ వారి ఇంటికి చేరుకోవడంతో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ సందర్భంగా రాజు కుటుంబసభ్యులు మీడియాతో మాట్లాడుతూ… ‘రాజు ఆత్మహత్య చేసుకోలేదు. పోలీసులు చంపి ఆత్మహత్యగా చిత్రీకరించి నాటకం ఆడుతున్నారు.’ అని కుటుంబ సభ్యులు ఆరోపించారు.






