బాలీవుడ్ నటుడు రాజీవ్ కపూర్ కన్నుమూత

by  |
బాలీవుడ్ నటుడు రాజీవ్ కపూర్ కన్నుమూత
X

దిశ, సినిమా: బాలీవుడ్ సీనియర్ నటుడు రాజీవ్ కపూర్ తుదిశ్వాస విడిచారు. 58 ఏళ్ల వయస్సులో హార్ట్‌ఎటాక్‌తో మరణించారు. ‘రామ్ తేరి గంగా మైలీ’ చిత్రంలో నటించిన ఆయన.. దివంగత రాజ్‌కపూర్ చిన్నకొడుకు. రిషి కపూర్, రణ్‌ధీర్ కపూర్‌ల సోదరుడు. కాగా ఈ విషయాన్ని తెలుపుతూ నీతు కపూర్ పోస్ట్ పెట్టడంతో.. బాలీవుడ్ సెలబ్రిటీలు సంతాపం ప్రకటిస్తున్నారు. ఏక్ జాన్ హై హమ్(1983) చిత్రం ద్వారా బీటౌన్‌కు ఎంట్రీ ఇచ్చిన రాజీవ్.. ‘ఆస్మాన్, లవర్ బాయ్, జబర్దస్త్’ చిత్రాల్లో నటించారు. ‘రామ్ తేరి గంగా మైలీ’ ద్వారా పాపులారిటీ సొంతం చేసుకున్న ఆయన.. ఈ చిత్రంలో మందాకినితో కలిసి నటించారు. ఈ చిత్రానికి ఆయన తండ్రి రాజ్ కపూర్ దర్శకులు కావడం విశేషం.

Next Story

Most Viewed