రజినీకాంత్‌పై అభిమానం.. మేక రక్తంతో అభిషేకం

by  |
Rajanikanth
X

దిశ, సినిమా : సూపర్ స్టార్ రజినీకాంత్‌కు ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్నారు. తన స్టైల్, మ్యానరిజంకు ప్రజెంట్ జనరేషన్‌లోనూ ఫ్యాన్స్ ఉండగా.. ఈ మధ్య రిలీజ్ అయిన అన్నాత్తె మూవీ లుక్‌కు ఫిదా అయ్యారు. ఈ క్రమంలో తమ అభిమానాన్ని చాటుకునేందుకు మేకను బలిచ్చారు. ఆ రక్తంతో సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌పై అభిషేకం చేశారు. మూవీ సూపర్ సక్సెస్ కావాలని కోరుకుంటూ ఈ పని చేసినట్లు తెలుస్తుండగా.. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో కొందరు రజినీ ఫ్యాన్స్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ అభిమాన నటుల కటౌట్లు, ఫస్ట్ లుక్‌లకు పాలాభిషేకం చేయడం ఆనవాయితీగా ఉండగా.. ప్రస్తుతం జరిగిన యాక్ట్‌తో షాక్ అయ్యామని చెబుతున్నారు. దీన్ని వ్యతిరేకించాల్సిన అవసరముందని అభిప్రాయడిన వారు.. ఇలాంటి ఘటనలు రిపీట్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.


Next Story

Most Viewed