ఆగిన సూపర్ స్టార్ మూవీ షూటింగ్

by  |
ఆగిన సూపర్ స్టార్ మూవీ షూటింగ్
X

దిశ, వెబ్‌డెస్క్: సూపర్ స్టార్ రజనీకాంత్ ‘అన్నాత్తె’ షూటింగ్ ఆగిపోయింది. రొటీన్ టెస్టింగ్‌లో భాగంగా చెక్ చేయగా నలుగురు యూనిట్ సభ్యులకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు తెలిపింది నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్. తలైవాతో పాటు మిగిలిన అందరికీ కూడా నెగెటివ్ వచ్చిందని..కానీ, అందరి సేఫ్టీని పరిగణనలోకి తీసుకుని షూటింగ్ నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.
అప్‌డేట్ ఇచ్చినందుకు థాంక్స్ చెప్పిన రజనీ అభిమానులు..పూర్తిగా సేఫ్ అయితేనే తిరిగి షూటింగ్ ప్రారంభించాలని కోరుతున్నారు. తలైవా హెల్త్ కన్నా తమకు ఏదీ ఎక్కువ కాదని చెప్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ‘అన్నాత్తె’ షూటింగ్ జరుగుతుండగా.. కీర్తి సురేశ్, నయనతార, ఖుష్బూ, మీనా ప్రధానపాత్రల్లో నటిస్తున్నారు.

Next Story

Most Viewed