- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రజినీకాంత్ అభిమానులకు గుడ్ న్యూస్
<p>దిశ, సినిమా : ఆరు పదుల వయసులో కూడా తనదైన స్టైల్‌తో, నటనతో ప్రేక్షకులను కట్టిపడేయగల నటుడు సూపర్ స్టార్ రజినీకాంత్. సినిమా రంగానికి ఆయన చేసిన సేవలకు కేంద్రం ఆయనను దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుతో సత్కరించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడిన ప్రసంగంలో అభిమానుల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. అయితే ఆ తర్వాత స్వల్ప అస్వస్థతకు గురైన రజినీని ఆయన కుటుంబ సభ్యులు చెన్నైలోని కావేరి ఆస్పత్రిలో చేర్పించారు. దీంతో అభిమానులు రజినీ ఆరోగ్యం గురించి […]</p>

దిశ, సినిమా : ఆరు పదుల వయసులో కూడా తనదైన స్టైల్‌తో, నటనతో ప్రేక్షకులను కట్టిపడేయగల నటుడు సూపర్ స్టార్ రజినీకాంత్. సినిమా రంగానికి ఆయన చేసిన సేవలకు కేంద్రం ఆయనను దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుతో సత్కరించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడిన ప్రసంగంలో అభిమానుల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. అయితే ఆ తర్వాత స్వల్ప అస్వస్థతకు గురైన రజినీని ఆయన కుటుంబ సభ్యులు చెన్నైలోని కావేరి ఆస్పత్రిలో చేర్పించారు.
దీంతో అభిమానులు రజినీ ఆరోగ్యం గురించి ఆందోళన చెందారు. తాజాగా రజనీ అభిమానులకు తీపికబురు అందించారు. ‘నేను క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చాను’ అంటూ తాను ఇంటికి చేరుకున్న ఫొటోను షేర్ చేయగా.. అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. రజినీకాంత్ మెదడుకు సంబంధించిన రక్తనాళాల్లో బ్లాక్స్ గుర్తించామని, అందుకు సరైన చికిత్స చేశామని వైద్యులు ప్రకటించిన సంగతి తెలిసిందే.
https://twitter.com/rajinikanth/status/1454858945797898251?ref_src=twsrc^google|twcamp^serp|twgr^tweet






