ప్రాణం తీసిన ఫ్యాన్ వార్…

by  |
ప్రాణం తీసిన ఫ్యాన్ వార్…
X

తమిళనాడులో హీరోలను దేవుళ్లుగా పూజిస్తారు. అభిమాన నటులకు గుడి కూడా కట్టిస్తారు. తమ హీరో అంటే వాళ్లకి అంత అభిమానం. ఒక్క మాట అన్న ఊరుకోరు. అందుకే అక్కడ ఫ్యాన్ వార్ కూడా ఎక్కువే. హీరోలు క్లోజ్ గా ఉన్నా… ఫ్యాన్స్ మాత్రం గొడవ పడుతూనే ఉంటారు. ఈ ఫ్యాన్ వార్ ఎంత దూరం వెళ్లింది అంటే… ఒక నిండు ప్రాణం పోయే వరకు.. ప్రాణం తీసే వరకు.

తమిళనాడులోని విల్లిపురం జిల్లా మరక్కనం గ్రామానికి చెందిన యువ రాజ్ విజయ్ ఫ్యాన్ కాగా…దినేష్ బాబు రజినీకాంత్ అభిమాని. కరోనా మహమ్మారిపై పోరాటానికి మా హీరో ఎక్కువ విరాళం ఇచ్చాడు అంటే లేదు మా హీరో ఎక్కువ డొనేట్ చేశాడు అంటూ ఇద్దరి మధ్య వాగ్వాదం ప్రారంభం అయింది. అది కాస్త ఘర్షణకు దారి తీసింది. ఈ క్రమంలో రజినీ ఫ్యాన్ నెట్టేయగా కింద పడిన విజయ్ ఫ్యాన్ తీవ్రగాయాలతో అక్కడికక్కడే చనిపోయాడు. దీంతో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పాండిచ్చేరి ఆస్పత్రికి తరలించారు పోలీసులు. దినేష్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు… కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Tags: Rajinikanth, Vijay, Kollywood, Fan War, Fans

Next Story

Most Viewed