విరాట్ సేన ముందు 178 పరుగులు

by  |
విరాట్ సేన ముందు 178 పరుగులు
X

దిశ, వెబ్‌డెస్క్: టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన రాజస్తాన్ రాయల్స్‌ మంచి ఇన్నింగ్స్‌ ఆడింది. నిర్ధిష్ఠ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. క్రీజులోకి దిగిన రాజస్తాన్‌ బ్యాట్స్‌మెన్లు ఉన్నంత సేపు బ్యాట్‌కు పని చెప్పారు. దీంతో 6 వికెట్లు నష్టపోయినా.. స్కోరు మాత్రం 177కు చేరింది.

ఇన్నింగ్స్‌ సాగిందిలా…

తొలుత ఓపెనింగ్ వచ్చిన రాబిన్ ఉతప్ప(41) మంచి ఇన్నింగ్స్ ఆడాడు. 22 బంతుల్లో 7 ఫోర్లు, 1 ఒక సిక్సర్ కొట్టాడు. ఇక బెన్ స్టోక్స్‌ (15) పరుగులు చేసి క్రిస్ మోరిస్ బౌలింగ్‌లో క్యాచ్ అవుట్ అయ్యాడు. ఇక ఆ తర్వాత కాసేపటికే హాఫ్ సెంచరీకి చేరువలో ఉన్న రాబిన్ ఉతప్ప చాహల్ వేసిన బంతికి షాట్ ఆడబోయి అతనూ క్యాచ్ అవుట్ అయ్యాడు. ఇక వన్‌డౌన్‌లో వచ్చిన సంజూ శాంసన్ (9) పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. చాహల్ ఓవర్‌లో సిక్స్‌ కొట్టే ప్రయత్నంలో క్రిస్ మోరిస్‌కు క్యాచ్ ఇచ్చాడు. దీంతో 69 పరుగుల వద్ద రాజస్తాన్ టాప్‌ ఆర్డర్‌ను కోల్పోయింది.

ఇక మిడిలార్డర్‌లో వచ్చిన స్టీవ్ స్మిత్ (57) పరుగులతో స్కోరు బోర్డును ముందుకు తీసుకెళ్లాడు. 6 ఫోర్లు, 1 సిక్సర్ కొట్టి కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. జోస్ బట్లర్ కూడా బాల్ టు బాల్ రన్స్ చేశాడు. 25 బంతుల్లో 24 పరుగులు చేసి క్రిస్ మోరిస్ ఓవర్‌లోనే క్యాచ్ అవుట్ అయ్యాడు. ఆ తర్వాత స్టీవ్ స్మిత్‌కు రాహుల్ తెవాతియా(19) మంచి భాగస్వామ్యం ఇచ్చాడు. ఇద్దరు కలిసి స్కోరు బోర్డు 200 వైపు తీసుకెళ్లే సమయంలో మోరిస్ మరో సారి షాక్ ఇచ్చాడు. 20వ ఓవర్‌లో స్మిత్‌ను కూడా క్యాచ్ అవుట్ అయ్యేలా చేశాడు. ఇక ఆ తర్వాత వచ్చిన జోఫ్రా ఆర్చర్ 2 పరుగులు చేసి చివరి బంతికి lbw అయ్యాడు. దీంతో నిర్ధిష్ఠ 20 ఓవర్లలో రాజస్తాన్ 177 పరుగులు చేయగలిగింది.

మోరిస్ మాయ చేశాడు:

బెంగళూరు జట్టులో లేట్‌గా ఎంట్రీ ఇచ్చిన క్రిస్ మోరిస్ మంచిగా రాణించాడు. రాజస్తాన్‌ బ్యాటింగ్ సమయంలో నాలుగు ఓవర్లు వేసిన క్రిస్ మోరిస్ ఏకంగా నాలుగు వికెట్లు తీసుకున్నాడు. బెన్ స్టోక్స్, స్టీవ్ స్మిత్, జోస్ బట్లర్, జోఫ్రా ఆర్చర్‌ లాంటి కీలక ఆటగాళ్ల వికెట్లు తీసుకున్నాడు. దీనికి తోడు కేవలం 26 పరుగులు మాత్రమే ఇవ్వడం గమనార్హం.

స్కోరు బోర్డు:

Rajasthan Royals Innings: 177-6 (20 Ov)
1. రాబిన్ ఉతప్ప c ఫించ్ b చాహల్ 41(22)
2. బెన్ స్టోక్స్ c డివిలియర్స్ b క్రిస్ మోరిస్ 15(19)
3. సంజూ శాంసన్ c క్రిస్ మోరిస్ b చాహల్ 9(6)
4. స్టీవ్ స్మిత్ (c) c షాబాజ్ అహ్మద్ b క్రిస్ మోరిస్ 57(36)
5. జోస్ బట్లర్ (wk)c నవదీప్ సైని b క్రిస్ మోరిస్ 24(25)
6. రాహుల్ తెవాతియా నాటౌట్ 19(11)
7. జోఫ్రా ఆర్చర్ 2(3)

ఎక్స్‌ట్రాలు: 10

మొత్తం స్కోరు: 177/6

వికెట్ల పతనం: 50-1 (బెన్ స్టోక్స్, 5.4), 69-2 (రాబిన్ ఉతప్ప, 7.4), 69-3 (సంజూ శాంసన్, 7.5), 127-4 (జోస్ బట్లర్, 15.3),
173-5 (స్టీవ్ స్మిత్, 19.2), 177-6 (జోఫ్రా ఆర్చర్, 19.6)

బౌలర్లు:

వాషింగ్టన్ సుందర్ 3-0-25-0
క్రిస్ మోరిస్ 4-0-26-4
ఇసురు ఉదాన 3-0-43-0
నవదీప్ సైని 4-0-30-0
యూజువేంద్ర చాహల్ 4-0-28-2
షాబాజ్ అహ్మద్ 2-0-18-0


Next Story

Most Viewed