‘శేఖర్’గా రాజశేఖర్.. ఏంటి కథ?

by  |
Dr. Rajasekhar
X

దిశ, సినిమా: యాంగ్రీ స్టార్ రాజశేఖర్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘శేఖర్’. ‘మ్యాన్ విత్ ద స్కార్’ అనేది ఉపశీర్షిక. లలిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ షూటింగ్ షెడ్యూల్ తాజాగా అరకులో ప్రారంభమైంది. ఇదే షెడ్యూల్‌లో 75% చిత్రీకరణ కంప్లీట్ చేస్తామన్న దర్శకుడు.. హీరో రాజశేఖర్‌తో పాటు హీరోయిన్ అను సితార, ఇతర ప్రధాన తారాగణం నడుమ కీలక సన్నివేశాలను తెరకెక్కించేందుకు ప్లాన్ చేసినట్టు వెల్లడించారు. ఇది రాజశేఖర్‌కు 91వ చిత్రం కాగా, ‘జార్జ్ రెడ్డి’ ఫేమ్ ముస్కాన్ కుబ్ చాందిని సెకండ్ హీరోయిన్‌గా నటిస్తోంది. కాగా సుమారు 20 రోజుల పాటు అరకులోనే షూటింగ్ చేస్తామని నిర్మాతలు వివరించారు. లక్ష్య ప్రొడక్షన్స్, పెగాసస్ సినీ కార్ప్ పతాకాలపై ఎమ్ఎల్‌వీ సత్యనారాయణ, శివాని, శివాత్మిక, వెంకట శ్రీనివాస్ బొగ్గరం నిర్మిస్తున్న చిత్రానికి ‘టికెట్ ఫ్యాక్టరీ’ డిజిటల్ పార్ట్‌నర్‌గా వ్యవహరిస్తోంది. లక్ష్మీ భూపాల రైటర్‌గా పనిచేస్తుండగా.. మల్లికార్జున్ నరగని సినిమాటోగ్రఫీ, అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందిస్తున్నారు.

Next Story