‘83’ మూవీ అద్భుతం.. తలైవా ట్వీట్ వైరల్

by  |
83
X

దిశ, సినిమా: సూపర్ స్టార్ రజినీకాంత్ ‘83’ మూవీపై ప్రశంసలు కురిపించారు. చిత్రం అద్భుతంగా ఉందని ట్విట్టర్ వేదికగా మూవీ యూనిట్‌ను అభినందించిన తలైవా.. ప్రొడ్యూసర్స్, డైరెక్టర్‌కు కంగ్రాట్స్ చెప్పారు. కాగా రణ్‌వీర్ సింగ్, దీపికా పదుకొనే ప్రధానపాత్రల్లో నటించిన చిత్రం.. కపిల్ దేవ్ జీవితకథ ఆధారంగా తెరకెక్కిన విషయం తెలిసిందే. ఆయన కెప్టెన్సీలో భారత క్రికెట్ జట్టు తొలి ప్రపంచకప్ అందుకున్న క్షణాలను దర్శకులు కబీర్ ఖాన్ అమేజింగ్‌గా తెరకెక్కించారు. ఇక రజినీ స్టేట్‌మెంట్‌తో ఈ మూవీ చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్న నెటిజన్లు.. నిజానికి మూవీ స్కిప్ చేయాలని డిసైడ్ అయ్యాం కానీ తలైవా చెప్పాడు కాబట్టి ఇప్పుడే టికెట్ బుక్ చేస్తామని చెబుతున్నారు.

Next Story

Most Viewed