బాహుబలి-3 పై జక్కన్న కీలక వ్యాఖ్యలు.. ఫ్యాన్స్‌కు పండుగే

by  |
prabhas
X

దిశ, డైనమిక్ బ్యూరో: బాహుబలి సినిమాతో తెలుగు సినిమాను ప్రపంచవ్యాప్తం చేసిన జక్కన్న ఓ కీలక ప్రకటన చేశారు. ఇప్పటికే బాహుబలి, బాహుబలి-2 సినిమాలతో రికార్డులు సృష్టించారు. ఈ సినిమాలు పూర్తవగానే.. రామ్ చరణ్, ఎన్టీఆర్ లు కథానాయకులుగా భారీ బడ్జెట్ మూవీ RRR సినిమాను తెరకెక్కించారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ భారీగా జరుగుతున్న క్రమంలో మరో సినిమాకి చెందిన అప్డేట్‌ను ప్రకటించి ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పారు. జక్కన్న మాట్లాడుతూ ‘‘ భవిష్యత్తులో బాహుబలి 3 తీస్తాను. ప్రస్తుతానికి ఇంతే చెప్పగలను. ఇంతకన్నా ఎక్కువ చెబితే అందరి ఫోకస్ అటు వెళ్తోంది’’ అంటూ చెప్పుకొచ్చారు. ఇక మహేష్ బాబుతో సినిమా పూర్తయిన తర్వాత బాహుబలి-3 ఉంటుందని ఫ్యాన్స్‌లో చర్చ మొదలైంది.

సీఎంకు వారసత్వ సవాల్… కవిత వర్గానికా? కేటీఆర్ వర్గానికా?



Next Story