హిందువులపై దాడిని ఐక్యతతో ఎదుర్కోవాలి: రాజాసింగ్

97

దిశ, గుడిహత్నూర్: హిందువులపై దాడిని ఐక్యతతో ఎదుర్కోవాలని బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ అన్నారు. ఆదివారం గుడిహత్నూర్‌లో ఆజాది కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా.. కుమురం భీం బలిదాన్ దివాస్‌ను జిల్లా హిందూవాహిని ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే జరిగిన హిందూ మహా సమ్మేళనం కార్యక్రమంలో రాజాసింగ్ పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పార్టీలకతీతంగా రామరాజ్య స్థాపన కోసం హిందువులంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు. దేశంలో మోడీ పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారని అన్నారు. ఆదివాసీ ఆరాధ్య దైవం కుమురం భీం జల్ జంగల్ జమీన్ కోసం పోరాడి బలిదానం ఇచ్చారని, ఆయన పోరాట స్ఫూర్తిని కొనసాగించాలన్నారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..