పోర్న్ కేసు: రాజ్ కుంద్రాకు బిగుసుకుంటున్న ఉచ్చు.. కీలక ఆధారాలు లభ్యం

by  |
పోర్న్ కేసు: రాజ్ కుంద్రాకు బిగుసుకుంటున్న ఉచ్చు.. కీలక ఆధారాలు లభ్యం
X

దిశ, వెబ్‌డెస్క్: పోర్నోగ్రఫీ కేసులో వ్యాపార వేత్త, బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రాకు ఉచ్చు బిగుసుకుంటుంది. శుక్రవారం భర్త రాజ్ కుంద్రా కేసులో శిల్పా శెట్టి వాంగ్మూలాన్ని ముంబై క్రైమ్ బ్రాంచి పోలీసులు నమోదు చేశారు. జూహూలోని వారి నివాసాన్ని సెర్చ్ చేసిన పోలీసులకు కీలక ఆధారాలు లభించాయి. 2019 నుంచి కుంద్రా తీసిన 100 పోర్న్ చిత్రాలకు సంబంధించి టెరాబైట్స్ లో ఉన్న వీడియోలను సైబర్ క్రైమ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తన భర్త వియాన్ అనే సంస్థను నిర్వహించడాన్ని, దానికి కొన్ని రోజులు తాను డైరెక్టర్ గా ఉండి రాజీనామా చేసినట్లు శిల్పాశెట్టి పోలీసులకు తెలిపారు. ఎస్ బ్యాంకు లోను, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఆఫ్రికాలోను కుంద్రాకు అకౌంట్లు ఉన్నాయి. కుంద్రా కంపెనీల నుంచి ఈ ఖాతాలకు భారీగా సొమ్ము వెళ్లినట్లు తెలుస్తోంది. అలాగే మెర్క్యురీ ఇంటర్నేషనల్ అనే క్రికెట్ బెట్టింగ్ సంస్థ నుంచి సైతం ఈ ఖాతాలకు డబ్బు ట్రాన్స్ ఫర్ అయ్యేదని సమాచారం.

ఇంకా పోలీసులు లోతైన విచారణ జరుపుతున్నారు. రాజ్ కుంద్రా వాట్సాప్ చాటింగ్ లిస్ట్ ని కూడా పరిశీలిస్తున్నారు. 122 సినిమాల నిర్మాణానికి కాను రూ. 9 కోట్లు రాజ్ కుంద్రా డిమాండ్ చేసినట్లు చాటింగ్ లో ఉందని సమాచారం . ఈ డబ్బును హవాలాలో వాడినట్లు కీలక ఆధారాలు పోలీసులకు లభ్యమయినట్లు తెలుస్తోంది. ఇక ఈ హవాలాలో ఇప్పటివరకు 7.5 కోట్లను సైబర్ క్రైమ్ పోలీసులు సీజ్ చేశారు. మిగతా లావాదేవీల వివరాలు సేకరిస్తున్నారు. ఇకపోతే ఈరోజు శిల్పాశెట్టి చెల్లెలు షమితాశెట్టిని పోలీసులు విచారిస్తున్నారు. అక్కా, బావతో పాటు ఆమె కూడా ఈ వ్యవహారంలో ఉందా..? లేదా..? అని ప్రశ్నించనున్నారు.

Follow Disha Cinema Official Facebook Page :https://www.facebook.com/Dishacinema
Next Story

Most Viewed