రాజ్ కుంద్రా పోర్న్ కేసు: నాతో బలవంతంగా పోర్న్ వీడియోలు చేయించారు- నటి

468

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ హీరోయిన్ శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఇప్పటికే రాజ్ కుంద్రా పోర్నోగ్రఫీ కేసులో ఆయన ఉద్యోగులే ఆయనకు వ్యతిరేకంగా సాక్ష్యాలు ఇవ్వగా.. తాజాగా ముంబై కి చెందిన ఒక నటి హాట్‌షాట్స్‌ కోసం తనతో బలవంతంగా పోర్న్‌ వీడియోలు చేయించారని పేర్కొంటూ పోలీసులకు ఫిర్యాదుచేసింది. అడల్ట్ సినిమాల్లో అవకాశాల పేరుతో పలువురు నటులతో నీలి చిత్రాలు తీశారన్న ఆరోపణలను ఎదుర్కుంటున్న రాజ్ కుంద్రా కేసు లో నటి గహనా వశిష్ఠ్‌ కూడా సంబంధం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు.

ఇక ఈ అనుమానాలకు బలం చేకూరుస్తూ ఒక నటి తనతో రాజ్ కుంద్రా, నటి గహనా వశిష్ఠ్‌ బలవంతంగా పోర్న్ వీడియోలలో యాక్ట్ చేయించారని క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో  నటి గహనా వశిష్ఠ్‌తోపాటు రాజ్‌కుంద్రా సంస్థకు చెందిన నలుగురిపై పోలీసులు తాజాగా కేసు నమోదు చేశారు. పోర్న్ సినిమాలను నిర్మిస్తున్నారనే ఆరోపణలతో ఇప్పటికే నటి గహానా వశిష్ఠ్  జైలుకు వెళ్లి బెయిల్ పై బయటికి వచ్చిన సంగతి తెలిసిందే. ఇకపోతే రాజ్‌కుంద్రా ప్రస్తుతం  జ్యూడిషియల్‌ కస్టడీలో ఉన్నారు. ఈ క్రమంలోనే బాధితులు బయటకు రావడం సంచలనం సృష్టిస్తోంది. హాట్‌షాట్స్‌ యాప్‌, దాని నిర్వాహకులపై పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు.

Follow Disha daily on Telegram : https://t.me/dishatelugu

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..