- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణలో నేడు, రేపు వర్షాలు..
by Shyam |
<p>దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణలోని పలు ప్రాంతాల్లో నిన్న కురిసిన అకాల వర్షం కారణంగా రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కల్లాలు, మార్కెట్లలో ఆరబెట్టిన ధాన్యం తడిసిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. కాగా, నిన్న రాత్రి రాష్ట్రంలోని 130 ప్రాంతాల్లో వానలు పడ్డాయి. జనగామ జిల్లాలోని లింగాల ఘనపురంలో అత్యధికంగా 4.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఒడిశాపై 1,500 మీటర్ల ఎత్తు వరకు గాలులతో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీనికితోడు తమిళనాడు నుంచి కొంకణ్ వరకు గాలులతో […]</p>

X
దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణలోని పలు ప్రాంతాల్లో నిన్న కురిసిన అకాల వర్షం కారణంగా రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కల్లాలు, మార్కెట్లలో ఆరబెట్టిన ధాన్యం తడిసిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. కాగా, నిన్న రాత్రి రాష్ట్రంలోని 130 ప్రాంతాల్లో వానలు పడ్డాయి. జనగామ జిల్లాలోని లింగాల ఘనపురంలో అత్యధికంగా 4.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
ఒడిశాపై 1,500 మీటర్ల ఎత్తు వరకు గాలులతో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీనికితోడు తమిళనాడు నుంచి కొంకణ్ వరకు గాలులతో ఉపరితల ద్రోణి ఏర్పడింది. వీటి ప్రభావంతో తెలంగాణలో నేడు, రేపు కూడా ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
Next Story






