- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అలర్ట్: ఈ జిల్లాల్లోనే ఇవాళ ఫుల్లు వర్షం
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్ డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో గత మూడు నాలుగు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. చెరువులు, కుంటలు, వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ తాజాగా ఓ ప్రకటన చేసింది. మరో 3 రోజులపాటు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశమున్నదని పేర్కొన్నది. తెలంగాణలోని వరంగల్, ములుగు, నిర్మల్, కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, భూపాలపల్లి, కొమురంభీం, ఆదిలాబాద్, మంచిర్యాల జిల్లాల్లో ఇవాళ భారీ నుంచి […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో గత మూడు నాలుగు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. చెరువులు, కుంటలు, వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి.
ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ తాజాగా ఓ ప్రకటన చేసింది. మరో 3 రోజులపాటు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశమున్నదని పేర్కొన్నది. తెలంగాణలోని వరంగల్, ములుగు, నిర్మల్, కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, భూపాలపల్లి, కొమురంభీం, ఆదిలాబాద్, మంచిర్యాల జిల్లాల్లో ఇవాళ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొన్నది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తమంగా ఉండాలని హెచ్చరించింది.
Next Story






