ఏపీ ప్రజలు జాగ్రత్త.. మరో మూడు రోజులు భారీవర్షాలు

by  |
heavy rains
X

దిశ, వెబ్‌కడెస్క్ : ఇప్పటికే భారీ వర్షాలతో ఏపీ అతలాకుతలం అయిపోయింది. చాలా చోట్ల పెద్ద పెద్ద భవనాలు, ఇళ్లులు కూలిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడిప్పుడే కాస్త వర్షాలు తగ్గుతున్నాయని ఊపిరి పీల్చుకునే ఏపీ ప్రజలకు మరో షాకింగ్ న్యూస్ తెలిపింది వాతావరణ శాఖ. నైరుతి బంగాళాఖాతంలో దక్షిణ తమిళనాడు,శ్రీలంక తీరంలో బుధవారం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణశాఖ వెల్లడించింది. ఈ అల్పపీడనం మరింత బలపడి 26న తమిళనాడు, శ్రీలంక ప్రాంతాల్లోనే తీరం దాటే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ అధికారులు పేర్కొన్నారు. దీని ప్రభావంతో 26, 27 తేదీల్లో నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో, 27వ తేదీ వైఎస్సార్‌ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని , అందువలన ఆ జిల్లాల ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. అంతే కాకుండా తమిళనాడుకు కూడా వర్షాలు పొంచి ఉన్నాయి. నాలుగు రోజుల పాటు తమిళనాడులో వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది. తమిళనాడుకు ఎల్లో అలెర్ట్ కూడా జారీ చేసింది.


Next Story

Most Viewed