చల్లబడింది.. నగరంలో చిరుజల్లులు

by Shyam |   ( Updated:2021-05-05 06:08:49.0  )
చల్లబడింది.. నగరంలో చిరుజల్లులు
X

దిశ, వెబ్‌డెస్క్ : హైదరాబాద్ ఒక్కసారిగా చల్లబడింది. మధ్యాహ్నం వరకు వేడిమితో అల్లాడిన నగర వాసులను వర్షం పలకరించింది. చిరుజల్లులు కురవడంతో వాతవరణం ఆహ్లాదకరంగా మారింది. నగరంలోని కొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షపాతం నమోదైనట్లు తెలుస్తోంది. దీంతో పలు చోట్ల ట్రాఫిక్ అంతరాయం ఏర్పడినట్లు తెలుస్తోంది. అయితే, ఓ వైపు కరోనా మరోవైపు ఎండ తీవ్రతతో సతమతమవుతున్న నగరవాసులకు వర్షం కొంత ఉపశమనం కలిగించినట్లు సమాచారం.

Advertisement

Next Story