రైల్వే ప్రైవేటీకరణ అవాస్తవం- ప్యాసింజర్ సర్వీస్ కమిటీ చైర్మన్

by  |
service-
X

దిశ బేగంపేట: రైల్వేను కేంద్ర ప్రభుత్వం ప్రైవేటుపరం చేస్తుందంటూ వస్తున్న వార్తలు అవాస్తవమని ప్యాసింజర్ సర్వీస్ కమిటీ చైర్మన్ రమేష్ చంద్రరతన్ స్పష్టం చేశారు. మంగళవారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు వచ్చిన ఆయన, రైల్వే స్టేషన్‌లో ప్రయాణికులకు అందే సౌకర్యాలు, సదుపాయాలు ఏ విధంగా ఉన్నాయో అడిగి తెలుసుకున్నారు.

ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఆధ్వర్యంలో రైల్వేలో ప్రపంచ స్థాయి సౌకర్యాలు కల్పిస్తున్నామని స్పష్టం చేశారు. అంతకు ముందు సికింద్రాబాద్‌కు వచ్చిన ఆయనను నూతనంగా ఎన్నికైన ప్యాసింజర్ సర్వీస్ కమిటీ సభ్యులు ప్రదీప్ రావు, రాంగోపాల్‌పేట్, మోండా డివిజన్ కార్పొరేటర్‌లు చీర సుచిత్ర శ్రీకాంత్, కొంత దీపికానరేష్ , భాజపా నాయకులు సారాంగపాణి, ప్రభు గుప్తా, రవి తదితరులు కలిసి పలు విషయాలను చర్చించారు. అనంతరం రమేష్ చంద్రరతన్‌ను ఘనంగా సన్మానించారు.

Next Story

Most Viewed