- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మోడీపై కామెంట్లు.. సూరత్ కోర్టులో రాహుల్ గాంధీ..
by Shamantha N |
<p>అహ్మదాబాద్: కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గురువారం గుజరాత్‌లోని సూరత్ కోర్టులో హాజరయ్యారు. 2019 ఎన్నికల ప్రచారంలో మోడీ ఇంటిపేరుపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన కేసులో ఆయన వివరణ ఇచ్చారు. తాను వ్యంగ్యంగానే ఆ పేరును ప్రస్తావించారని, ఏ వర్గాన్ని లక్ష్యం చేసుకుని పదప్రయోగం చేయలేదని వివరించారు. ‘నీరవ్ మోడీ, లలిత్ మోడీ, నరేంద్ర మోడీ.. వీరందరి ఇంటిపేర్లు ఒకేలా ఎందుకున్నాయి? ఈ దొంగలందరి సర్‌నేమ్ మోడీ అనే ఎందుకు ఉన్నది?’ అంటూ ఆయన చేసిన […]</p>

X
అహ్మదాబాద్: కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గురువారం గుజరాత్‌లోని సూరత్ కోర్టులో హాజరయ్యారు. 2019 ఎన్నికల ప్రచారంలో మోడీ ఇంటిపేరుపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన కేసులో ఆయన వివరణ ఇచ్చారు. తాను వ్యంగ్యంగానే ఆ పేరును ప్రస్తావించారని, ఏ వర్గాన్ని లక్ష్యం చేసుకుని పదప్రయోగం చేయలేదని వివరించారు. ‘నీరవ్ మోడీ, లలిత్ మోడీ, నరేంద్ర మోడీ.. వీరందరి ఇంటిపేర్లు ఒకేలా ఎందుకున్నాయి? ఈ దొంగలందరి సర్‌నేమ్ మోడీ అనే ఎందుకు ఉన్నది?’ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. రాహుల్ వ్యాఖ్యలు మోడీ కమ్యూనిటీని దొంగలుగా చిత్రిస్తున్నాయని, తమ మనోభావాలు దెబ్బతిన్నాయని సూరత్ కోర్టులో బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేశ్ మోడీ పరువునష్టం దావా వేశారు. ఫైనల్ స్టేట్‌మెంట్ కోసం రాహుల్ గురువారం కోర్టులో హాజరయ్యారు. తదుపరి విచారణ జులై 12కు కోర్టు వాయిదా వేసింది.
Next Story






