బజాజ్ ఆటో చైర్మన్ పదని నుంచి వైదొలగిన రాహుల్ బజాజ్!

by  |
బజాజ్ ఆటో చైర్మన్ పదని నుంచి వైదొలగిన రాహుల్ బజాజ్!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఆటో దిగ్గజ సంస్థ బజాజ్ ఆటో చైర్మన్, నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాహుల్ బజాజ్ పదవి నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించారు. ఈ నిర్ణయం శుక్రవారం(ఏప్రిల్ 30) నుంచి అమల్లోకి రానుంది. తన వయస్సును పరిగణనలోకి తీసుకుని బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్టు రెగ్యులేటరీ ఫైలింగ్‌లో కంపెనీ పేర్కొన్నారు. అనంతరం మే 1 నుంచి రాహుల్ బజాజ్ ఐదేళ్ల వరకు కంపెనీ చైర్మన్ ఎమెరిటస్‌గా ఉంటారని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. ఇక, రాహుల్ బజాజ్ అనంతరం ఆ బాధ్యతలను నీరజ్ బజాజ్ స్వీకరిస్తారని కంపెనీ పేర్కొంది.

గత ఐదు దశాబ్దాలుగా సంస్థ విజయానికి రాహుల్ బజాజ్ విశేషమైన కృష్టి చేశారని’ బజాజ్ ఆటో స్టాక్ ఎక్స్ఛేంజ్‌ ఫైలింగ్‌లో పేర్కొంది. అదేవిధంగా బజాజ్ ఆటో గురువారం 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మార్చి త్రైమాసిక ఫలితాలను వెల్లడించింది. సమీక్షించిన త్రైమాసికంలో కంపెనీ నికర లాభం 14.57 శాతం పెరిగి రూ. 1,551.28 కోట్లుగా నమోదు చేసింది. కంపెనీ ఆదాయం 26 శాతం వృద్ధితో రూ. 8,596.10 కోట్లకు చేరుకుంది. ఒక్కో షేర్‌కు రూ. 140 డివిడెండ్‌ను కంపెనీ బోర్డు ఆమోదించింది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో గురువారం కంపెనీ షేర్ ధర 1.82 శాతం తగ్గి రూ. 3,818.95 వద్ద ట్రేడయింది.



Next Story

Most Viewed