‘రజినీకాంత్ తమిళనాడు సీఎం కావాలి’

by Vadlamudi Anukaran |   (  Updated:2020-09-13 09:08:17  IST  )

<p>దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ సినీ నటుడు రాఘవా లారెన్స్ మరోసారి సూపర్‌స్టార్ రజినీకాంత్ రాజకీయ జీవితంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రజినీకాంత్ తమిళనాడు సీఎం కావాలని&#8230; ప్రజలకు ఆయన రాజకీయంగా సేవ చేయాలని ఆకాంక్షించారు. ప్రస్తుత పరిస్థితుల్లో కాకపోతే&#8230; ఇంకెప్పుడు పార్టీ పెడతారని ఆయన రజనీకాంత్‌ను ప్రశ్నించారు. ‘మీరు కదలిరండి&#8230; మీకు మేము తోడుగా ఉంటాం’ అని లారెన్స్ కోరారు. ముఖ్యమంత్రిగా ఉండే ఆలోచన లేదని గతంలో రజినీ చెప్పిన మాటలని మరోసారి పరిశీలించాలని అభిప్రాయపడ్డారు. రజినీకాంత్ [&hellip;]</p>

‘రజినీకాంత్ తమిళనాడు సీఎం కావాలి’
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ సినీ నటుడు రాఘవా లారెన్స్ మరోసారి సూపర్‌స్టార్ రజినీకాంత్ రాజకీయ జీవితంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రజినీకాంత్ తమిళనాడు సీఎం కావాలని… ప్రజలకు ఆయన రాజకీయంగా సేవ చేయాలని ఆకాంక్షించారు. ప్రస్తుత పరిస్థితుల్లో కాకపోతే… ఇంకెప్పుడు పార్టీ పెడతారని ఆయన రజనీకాంత్‌ను ప్రశ్నించారు. ‘మీరు కదలిరండి… మీకు మేము తోడుగా ఉంటాం’ అని లారెన్స్ కోరారు.

ముఖ్యమంత్రిగా ఉండే ఆలోచన లేదని గతంలో రజినీ చెప్పిన మాటలని మరోసారి పరిశీలించాలని అభిప్రాయపడ్డారు. రజినీకాంత్ నిర్ణయాన్ని మార్చుకునే వరకూ నా ప్రయత్నం కొనసాగుతోందని అన్నారు. అంతేగాకుండా ఎలాగైన తమిళనాడు ముఖ్యమంత్రిగా రజినీకాంత్ కావాలని లారెన్స్ వెల్లడించారు. ఇటీవల రజినీకాంత్ పార్టీలో చేరతానని లారెన్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

Next Story