అనురాగ్‌.. నీ సమక్షంలో భద్రంగా ఉన్నా : రాధికా ఆప్టే

by  |
అనురాగ్‌.. నీ సమక్షంలో భద్రంగా ఉన్నా : రాధికా ఆప్టే
X

దిశ, వెబ్ డెస్క్ : బాలీవుడ్‌ దర్శక, నిర్మాత అనురాగ్‌ కశ్యప్‌ మీద నటి పాయల్‌ ఘోష్‌ లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. తెలుగులో ‘ప్రయాణం, ఊసరవెల్లి’ సినిమాల్లో నటించిన పాయల్ ఘోష్ .. ఈ ఆరోపణలు చేయడంతో మరోసారి ‘క్యాస్టింగ్ కౌచ్’ వివాదం తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలో పలువురు సినీ ప్రముఖులు అనురాగ్ కశ్యప్‌ను అరెస్ట్ చేయాలంటూ ట్విట్టర్‌లో హాష్‌ట్యాగ్‌లు పెడుతూ డిమాండ్ చేస్తున్నారు. కాగా హీరోయిన్ రాధికా ఆప్టే.. అనురాగ్ కశ్యప్‌కు మద్దతుగా ఇ‌న్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టింది.

‘అనురాగ్.. మీరు నా క్లోజ్ ఫ్రెండ్స్‌లో ఒకరు. మీరు నన్ను ఇన్స్‌పైర్ చేశారు.. ఎల్లప్పుడూ నాకు సపోర్ట్‌గా ఉన్నారు. సదా నన్ను సమానంగా చూశారు. మనం ఒకరికొకరు కలిగి ఉన్న పరస్పర ప్రేమను, గౌరవాన్ని నేను ఎంతో ఆదరిస్తాను. నాకు మీరు తెలిసిన రోజు నుంచి ఇప్పటివరకు మీ సమక్షంలో ఉన్న ప్రతీ క్షణం ఎంతో భద్రంగా ఉన్నాను. మీరు ఎప్పటికీ నా నమ్మకమైన ఫ్రెండ్. లవ్ యా..’ అని పోస్ట్ చేసింది రాధికా ఆప్టే. దీనికి అనురాగ్ కశ్యప్‌తో ఉన్న ఫొటోను షేర్ చేసింది. కాగా హీరోయిన్ తాప్సీ కూడా అనురాగ్ కశ్యప్ కి సపోర్ట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇక బాలీవుడ్‌ చిత్రాల ఎడిటర్, అనురాగ్‌ కశ్యప్‌ భార్య ఆర్తీ బజాజ్‌.. పాయల్‌ చేసిన ఆరోపణలను ‘చీప్‌’ అని కొట్టేపారేశారు.

ఇదిలా ఉంటే.. నటి కంగనా రనౌత్ పాయల్ ఘోష్‌కు మద్దతు తెలిపింది. ‘అనురాగ్‌ను అరెస్ట్‌ చేయండి. అవకాశాల కోసం వచ్చే అవుట్‌సైడర్స్‌ను బాలీవుడ్‌లో సెక్స్‌ వర్కర్స్‌లా చూడటం అలవాటే’ అని ట్విట్టర్‌లో పోస్ట్ పెట్టింది కంగనా. కాగా, తన మీద వచ్చిన ఆరోపణల్లో నిజం లేదని, అవన్నీ అవాస్తవాలని అనురాగ్‌ కశ్యప్‌ స్పందించారు.

https://www.instagram.com/p/CFXmFLCMbio/?utm_source=ig_web_button_share_sheet

Next Story

Most Viewed