ట్విట్టర్‌లో ‘రాధే శ్యామ్’ బెంచ్ మార్క్

by  |
ట్విట్టర్‌లో ‘రాధే శ్యామ్’ బెంచ్ మార్క్
X

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ లేటెస్ట్ మూవీ రాధే శ్యామ్. ప్రభాస్ 20వ చిత్రంగా వస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ శుక్రవారం రిలీజ్ అయింది. బుట్ట బొమ్మ పూజా హెగ్డే, డార్లింగ్ ప్రభాస్‌ల రొమాంటిక్ పోజ్ ఆకట్టుకోగా.. ఈ లుక్ ప్రభాస్ స్టామినాను మరోసారి ప్రూవ్ చేసింది. బాహుబలితో పాన్ ఇండియా స్టార్‌గా ఎదగడమే కాకుండా, విదేశాల్లోనూ అభిమానులను సంపాదించుకున్న డార్లింగ్.. రాధే శ్యామ్ లుక్ సోషల్ మీడియాలో రికార్డ్స్ క్రియేట్ చేసింది. ట్విట్టర్‌లో సింగిల్ హాష్ ట్యాగ్‌తో 24 గంటల్లో 6.3 మిలియన్ ప్లస్ ట్వీట్స్ సాధించిన ఫస్ట్ లుక్‌గా బెంచ్ మార్క్ సెట్ చేసింది. మూవీ యూనిట్ దీనిపై అఫిషియల్ అనౌన్స్‌మెంట్ ఇవ్వగా.. రికార్డుల వేట కొనసాగుతోంది.

https://twitter.com/RadheShyamFilm/status/1281819071210819584?s=19

ఇప్పటికే 70 శాతం చిత్రీకరణ పూర్తి కాగా.. 2021లో సినిమాను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది మూవీ యూనిట్. యూవీ క్రియేషన్స్, గోపికృష్ణ ఫిల్మ్స్, టి సిరీస్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాను రాధా కృష్ణ కుమార్ డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ ఫ్యూచర్ టెల్లర్‌గా కనిపించనుండగా.. పూజా యువరాణిగా అలరించనుంది.

కాగా, ఈ సినిమా తర్వాత మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ డైరెక్షన్‌‌లో పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేయబోతున్నాడు ప్రభాస్. వైజయంతి మూవీస్ బ్యానర్‌పై ఈ సినిమా రూపొందనుంది.


Next Story

Most Viewed