- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాధే శ్యామ్ షూటింగ్ ఎక్కడ?
<p>యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, గార్జియస్ పూజా హెగ్డే జంటగా నటిస్తున్న చిత్రం ‘రాధే శ్యామ్’. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్ర షూటింగ్ కరోనా కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. అయితే, ప్రభుత్వం చిత్రీకరణకు అనుమతించగానే రామోజీ ఫిల్మ్ సిటీలో మిగిలిన షూటింగ్ పూర్తి చేస్తారని, ఇందుకోసం సెట్ కూడా వేయడంతో సినిమా చిత్రీకరణ ఇక్కడే పూర్తవుతుందనే భావించారు. పైగా కరోనా పరిస్థితుల్లో ఎక్కడికి వెళ్లే చాన్స్ లేదు కాబట్టి లోకల్‌గానే ముగించేస్తారని […]</p>

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, గార్జియస్ పూజా హెగ్డే జంటగా నటిస్తున్న చిత్రం ‘రాధే శ్యామ్’. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్ర షూటింగ్ కరోనా కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. అయితే, ప్రభుత్వం చిత్రీకరణకు అనుమతించగానే రామోజీ ఫిల్మ్ సిటీలో మిగిలిన షూటింగ్ పూర్తి చేస్తారని, ఇందుకోసం సెట్ కూడా వేయడంతో సినిమా చిత్రీకరణ ఇక్కడే పూర్తవుతుందనే భావించారు. పైగా కరోనా పరిస్థితుల్లో ఎక్కడికి వెళ్లే చాన్స్ లేదు కాబట్టి లోకల్‌గానే ముగించేస్తారని అభిప్రాయపడ్డారు.
కానీ, మూవీ యూనిట్ ఆలోచన మాత్రం మరోలా ఉన్నట్టు తెలుస్తోంది. పీరియాడికల్ రొమాంటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా ఫిల్మ్ ఇప్పటికే బెల్జియంలో షూటింగ్ పూర్తి చేసుకోగా, ఇప్పుడు ఇటలీలో షూటింగ్ జరుపుకోనుందని సమాచారం. యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణ ఫిల్మ్స్, టీ సిరీస్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం.. ప్రభాస్ కెరియర్‌లో మరో బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందనుకున్నప్పటికీ.. ప్రస్తుత పరిస్థితుల్లో ఇటలీ షెడ్యూల్ రిస్క్‌తో కూడుకున్న పనే అని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి. చూడాలి మరి.. సెప్టెంబర్ రెండో వారం నుంచి జరగనున్న షూటింగ్ హైదరాబాద్‌లోనే జరుగుతుందా? లేక మూవీ యూనిట్ ఇటలీ చెక్కేస్తుందా అని.






