డార్లింగ్ ‘విక్రమాదిత్య’ క్లాసీ లుక్

by  |
డార్లింగ్ ‘విక్రమాదిత్య’ క్లాసీ లుక్
X

దిశ, వెబ్‌డెస్క్: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్.. ఇప్పటికే బర్త్‌‌డే సెలబ్రేషన్స్ స్టార్ట్ చేశారు. కామన్ డీపీ, మోషన్ పోస్టర్‌ ప్రభాస్ బర్త్‌డేకు రెండు రోజుల ముందే ట్రెండింగ్‌లో ఉంది. ఈ క్రమంలో ‘రాధే శ్యామ్’ టీమ్ కూడా అభిమానులతో కలిసి డార్లింగ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిపేందుకు ప్లాన్ చేసింది. ఈ క్రమంలోనే ‘రాధే శ్యామ్’ సర్‌ప్రైజ్ అంటూ ఫ్యాన్స్‌కు ట్రీట్ ఇచ్చింది. డార్లింగ్‌కు అడ్వాన్స్ హ్యాపీ బర్త్‌డే విషెస్ అందిస్తూ.. విక్రమాదిత్యగా ప్రభాస్‌ను పరిచయం చేస్తూ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసింది.

అఫ్‌‌కోర్స్ ప్రభాస్ లుక్ అదిరిపోయింది. నంబర్ ప్లేట్ మీద ప్రభాస్ అని రాసి ఉన్న గ్రీన్ కలర్ కారుపై కూర్చొని సూపర్ స్టైలిష్‌గా పోజ్ ఇచ్చిన డార్లింగ్.. బ్లూ అండ్ బ్లాక్ కాంబినేషన్ సూట్, బ్లాక్ షూ, కూలింగ్ గ్లాసెస్‌తో ఉన్న కటౌట్ చూసి ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. ఇది కదా మాకు కావాల్సింది.. సినిమా మొత్తం కూడా ఇలాగే ప్లాన్ చేయాలి అంటూ డైరెక్టర్ రాధా కృష్ణ కుమార్‌కు రిక్వెస్ట్ చేస్తున్నారు. ప్రభాస్ కెరీర్‌లోనే ది బెస్ట్ లుక్ అంటున్న ఫ్యాన్స్.. అక్టోబర్ 23న వచ్చే ప్రభాస్ బర్త్‌డే గిఫ్ట్ ఇంతకు మించి ఉండాలని కోరుతున్నారు. ఇప్పటికే ‘రాధే శ్యామ్’ సర్‌ప్రైజ్ ట్రెండింగ్‌లో ఉండగా.. ప్రభాస్ ఫస్ట్ లుక్ రికార్డ్ బ్రేకింగ్ పోస్టర్‌గా నిలవనుంది.

యూవీ క్రియేషన్స్, గోపీ కృష్ణ మూవీస్, టీ సిరీస్ బ్యానర్‌పై రూపుదిద్దుకుంటున్న సినిమా నుంచి ‘బీట్స్ ఆఫ్ రాధే శ్యామ్’ పేరుతో ప్రభాస్ పుట్టినరోజున మోషన్ పోస్టర్ రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. కాగా ఈ చిత్రానికి తమిళ మ్యూజిక్ డైరెక్టర్ జస్టిన్ ప్రభాకరన్ స్వరాలు సమకూరుస్తున్నారు. పాన్ ఇండియా లెవల్‌లో రిలీజ్ అవుతున్న సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ కాగా భాగ్య శ్రీ, ప్రియదర్శి, మురళి శర్మ ప్రధాన పాత్రల్లో కనిపించబోతున్నారు.


Next Story

Most Viewed