లింగ నిర్ధారణ చేసిన ప్రైవేటు ఆస్పత్రిపై కేసు..

by Batti.Sumithra |

<p>&#8211; ముగ్గురు వైద్యుల అరెస్టు &#8211; రాచకొండ పోలీసుల డెకాయ్ ఆపరేషన్ దిశ, న్యూస్ బ్యూరో: లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్న హైదరాబాద్‌లోని ఉప్పల్‌ లైఫ్‌కేర్ ఆస్పత్రి నిర్వాహకులు, వైద్యులపైన రాచకొండ పోలీసులు డెకాయ్ ఆపరేషన్ చేశారు. వారి గుట్టు రట్టు చేసి కేసు నమోదు చేశారు. ఆస్పత్రి ఎండీతో పాటు ఇద్దరు వైద్యులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. వివరాల్లోకెళితే..ఉప్పల్ లైఫ్ కేర్ ఆస్పత్రిలో లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారని విశ్వసనీయ సమాచారం అందుకున్న పోలీసులు [&hellip;]</p>

లింగ నిర్ధారణ చేసిన ప్రైవేటు ఆస్పత్రిపై కేసు..
X

– ముగ్గురు వైద్యుల అరెస్టు

– రాచకొండ పోలీసుల డెకాయ్ ఆపరేషన్

దిశ, న్యూస్ బ్యూరో: లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్న హైదరాబాద్‌లోని ఉప్పల్‌ లైఫ్‌కేర్ ఆస్పత్రి నిర్వాహకులు, వైద్యులపైన రాచకొండ పోలీసులు డెకాయ్ ఆపరేషన్ చేశారు. వారి గుట్టు రట్టు చేసి కేసు నమోదు చేశారు. ఆస్పత్రి ఎండీతో పాటు ఇద్దరు వైద్యులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.
వివరాల్లోకెళితే..ఉప్పల్ లైఫ్ కేర్ ఆస్పత్రిలో లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారని విశ్వసనీయ సమాచారం అందుకున్న పోలీసులు ఆస్పత్రిపై డెకాయ్ ఆపరేషన్ నిర్వహించాలని నిర్ణయించుకున్నారు.

ఆరు నెలల గర్భిణిగా ఉన్న మహిళా కానిస్టేబుల్‌ను ఆస్పత్రికి పంపించారు. ఆస్పత్రిలో వైద్యురాలు శ్రావణిని సంప్రదించిన కానిస్టేబుల్ తన గర్భస్థ శిశువుకు లింగ నిర్ధారణ పరీక్షలు చేయాల్సిందిగా కోరారు. అందుకు ఒప్పుకున్న వైద్యురాలు రూ.15 వేలు డిమాండ్ చేసింది. ఆస్పత్రి ఎండీ ఆంజనేయులు మరో వైద్యుడు రాఘవరెడ్డితో కలిసి లింగనిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. గర్భంలో ఉన్నది ఆడ శిశువు అని నిర్ధారించారు. దీంతో అప్పటికే సిద్ధంగా ఉన్న టీం ముగ్గురిని అరెస్ట్ చేయడంతో పాటు రూ.15వేల నగదు, ఆల్ట్రా సౌండ్ స్కానింగ్ మిషన్, 2 బైక్‌లు, 3 సెల్ పోన్లు సీజ్ చేశారు. ఈ ఆపరేషన్‌లో డిప్యూటీ డీఎం అండ్ హెచ్ఓ పల్లవి, ఉప్పల్ ఎస్ఐ జయరాం, సిబ్బంది పాల్గొన్నారు. నిందితులపై ఐపీసీ- 369, 420, 188, 406 సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేశారు.

Tags: Telangana, Sex determination, corona, Lockdown, Hospital,uppal rachakonda police

Next Story