- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ చోరీలపై స్పందించిన రాచకొండ సీపీ
<p>దిశ, క్రైమ్ బ్యూరో: నగర శివారులో వరుసగా జరుగుతున్న ఏటీఎం చోరీలకు పాల్పడుతున్నది అంతరాష్ట్ర ముఠాకు చెందినవారేనని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ తెలిపారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఇటీవల వరుస ఏటీఎం చోరీలపై సీపీ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన ఎల్బీనగర్ కాంపు కార్యాలయంలో శుక్రవారం మాట్లాడుతూ.. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ఏటీఎం చోరీలకు పాల్పడుతున్న ముఠాను హర్యానాకు చెందిన అంతర్రాష్ట్ర ముఠానే అని అనుమానం వ్యక్తం చేశారు. అయితే, ఏటీఎం కేంద్రాల్లో నిర్వాహణ […]</p>

దిశ, క్రైమ్ బ్యూరో: నగర శివారులో వరుసగా జరుగుతున్న ఏటీఎం చోరీలకు పాల్పడుతున్నది అంతరాష్ట్ర ముఠాకు చెందినవారేనని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ తెలిపారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఇటీవల వరుస ఏటీఎం చోరీలపై సీపీ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన ఎల్బీనగర్ కాంపు కార్యాలయంలో శుక్రవారం మాట్లాడుతూ.. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ఏటీఎం చోరీలకు పాల్పడుతున్న ముఠాను హర్యానాకు చెందిన అంతర్రాష్ట్ర ముఠానే అని అనుమానం వ్యక్తం చేశారు. అయితే, ఏటీఎం కేంద్రాల్లో నిర్వాహణ లోపాల కారణంగానే చోరీలకు గురవుతున్నాయని అన్నారు. ముఖ్యంగా ఏటీఎంల వద్ద సీసీ కెమెరాలు, అలారం తదితర సదుపాయాలను సంబంధిత బ్యాంకులు కల్పించకపోవడం వల్లే జరిగాయని వెల్లడించారు. ఈ లోపాలను గుర్తిస్తున్న దుండగులు చోరీలకు సులభంగా పాల్పడి లక్షల రూపాయలను దోచుకుంటున్నారని తెలిపారు. ఏటీఎం కేంద్రాల వద్ద నిబంధనలు పాటించని బ్యాంకులకు నోటీసులు అందజేస్తామన్నారు.






