ఆర్ నారాయణ మూర్తి పాట పాడిన RS ప్రవీణ్ కుమార్.. దద్దరిల్లిన సభ.. వీడియో

4284
R-narayana-murty-and-rs-pra

దిశ, వెబ్‌డెస్క్ : RS ప్రవీణ్ కుమార్ ఈ పేరు ఇప్పుడు తెలంగాణలో బహుషా తెలియని వారు ఉండకపోవచ్చు. ఈ మధ్యే ఆయన ఐపీఎస్ ఉద్యోగానికి స్వచ్చంద విరమణ తీసుకున్న విషయం తెలిసిందే. అనంతరం ఆయన తెలంగాణలోని పలు జిల్లాల్లో పర్యటిస్తూ సభలను ఏర్పాటు చేస్తూ తెలంగాణ ప్రభుత్వ తీరును ఎండగడుతున్నారు.

దళితులకు రాజ్యాధికారం కావాలని సభలో ఉపన్యసిస్తూ అందరినీ ఏకం చేస్తున్నారు. ఇదే క్రమంలో తాజాగా ప్రవీణ్ కుమార్ మంచిర్యాల జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా సభలో ఓ పాట పాడి అందర్ని ఆశ్యర్యానికి గురి చేశారు.

ఆర్ నారాయణ మూర్తి నటించిన ఎర్రసైన్యం సినిమాలోని పాటను పాడారు. ఈ ఊరు మనదిరా.. ఈ వాడ మనదిరా.. పల్లే మనదిరా.. ప్రతి పనికి మనం రా అంటూ.. పాట పాడటంతో సభలో ఉన్న వారంతా అరుపులు కేకలు వేయడంతో ఆ సభ ప్రాంగణమంతా దద్దరిల్లింది.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..