టెస్ట్ ర్యాంకింగ్స్‌లో రెండో స్థానానికి అశ్విన్

by  |
టెస్ట్ ర్యాంకింగ్స్‌లో రెండో స్థానానికి అశ్విన్
X

దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఐసీసీ తాజాగా బుధవారం ప్రకంటించిన టెస్ట్ ర్యాంకింగ్స్‌లో 2వ స్థానం దక్కించుకున్నాడు. బౌలింగ్ విభాగంలో టాప్ 10 ర్యాంకుల్లో అశ్విన్ ఒక్కడే ఉండటం గమనార్హం. టాప్ ర్యాంకులో ఆస్ట్రేలియా పేసర్ పాట్ కమిన్స్ (908 రేటింగ్ పాయింట్లు) అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. టీమ్ ఇండియా పేసర్ జస్ప్రిత్ బుమ్రా (739) 11వ స్థానంలో ఉన్నాడు. ఇక పాకిస్తాన్ బౌలర్లు జింబాబ్వేతో జరిగిన సిరీస్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి తమ ర్యాంకులు మెరుగు పరుచుకున్నారు. హసన్ అలీ 14వ ర్యాంకులో, షాహీన్ 22 ర్యాంకు, నౌమన్ అలీ 54వ స్థానానికి చేరుకున్నారు.

టాప్ 10 టెస్ట్ బౌలర్లు

పాట్ కమిన్స్ (908)
రవిచంద్రన్ అశ్విన్ (850)
నీల్ వాగ్నర్ (825
జేమ్స్ అండర్సన్ (822)
జోష్ హాజెల్‌వుడ్ (816)
టిమ్ సౌథీ (811)
స్టువర్డ్ బ్రాడ్ (792)
జాసన్ హోల్డర్ (755)
కగిసో రబాడ (753)
మిచెల్ స్టార్క్ (744)


Next Story

Most Viewed