చదువు సంధ్యల్లేని వెధవంటూ ఎంపీని ఎద్దేవా చేసిన పీవీపీ

by  |
చదువు సంధ్యల్లేని వెధవంటూ ఎంపీని ఎద్దేవా చేసిన పీవీపీ
X

చదువు సంధ్యల్లేని వెధవంటూ ఎంపీని ఉద్దేశించి ప్రముఖ సినీ నిర్మాత, వైఎస్సార్సీపీ తరపున విజయవాడ ఎంపీగా పోటీ చేసి ఓటమిపాలైన పొట్లూరి వరప్రసాద్ చేసి వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో పెను కలకలం రేపాయి. విజయవాడ నుంచి ఎంపీలుగా పోటీ చేసినప్పటి నుంచి ఎంపీ కేశినేని నాని, పీవీపీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ట్విట్టర్ వేదికగా కూడా వీరిద్దరూ విమర్శనాస్త్రాలు సంధించుకుంటారు. కరోనాపై జగన్ వ్యాఖ్యలను ఎద్దేవా చేస్తూ నాని వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో కేశినేని నానిని విమర్శిస్తూ చదువు సంధ్యలు లేని వెధవలు కూడా పార్లమెంటులో అడుగుపెడితే పరిణామాలు ఇలాగే ఉంటాయని పీవీపీ ఎద్దేవా చేశారు. ఇదిగో పులి అంటే అదిగో తోక అంటూ ఫేక్ న్యూస్ ప్రచారం ఆపి, కాస్తంత బాధ్యత కలిగిన ప్రజాప్రతినిధిలా పనిచేయవయ్యా అంటూ కేశినేని నానికి ట్విట్టర్ మాధ్యమంగా పీవీపీ హితవు పలికారు.

Tags : kesineni nani, tdp mp, pvp, tdp, ysrcp, twitter

Next Story

Most Viewed