సాయంత్రం 4 గంటలకు ఢిల్లీకి PV సింధు..

219
pv-sindu-bronze-medal

దిశ, వెబ్‌డెస్క్ : టోక్యో ఒలింపిక్స్‌లో సత్తా చాటిన పూసర్ల వెంకట సింధు సాయంత్రం 4 గంటలకు ఢిల్లీకి బయలు దేరనుంది. ఒలింపిక్స్‌‌లో బాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు సెమీస్‌లో పోరాడి ఓడినా.. కాంస్య పతకం గెలిచి దేశానికి గొప్ప కీర్తిని తీసుకొచ్చిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలోనే సాయంత్రం ఢిల్లీకి వెళ్లి ప్రధాని నరేంద్రమోడీ, క్రీడల మంత్రులను ఆమె కలవనున్నారు. అయితే, ఒలింపిక్స్‌లో దేశానికి మెడల్ తీసుకొస్తే సింధుతో కలిసి ఐస్ క్రీం తింటానని ప్రధాని మోడీ తెలుగు తేజానికి మాట ఇచ్చారు. ఈ క్రమంలోనే సింధును అభినందించడంతో పాటు ప్రధాని మోడీ ఆమెతో కాసేపు ముచ్చటించనున్నట్లు తెలుస్తోంది.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..