మాజీ ప్రధాని పీవీ కుమార్తెకు చేదు అనుభవం

by  |
vanidevi
X

దిశ, వెబ్‌డెస్క్: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను అధికార టీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో అనుకున్న స్థాయిలో ఫలితాలు రాకపోవడంతో దృష్టిమొత్తం నాగార్జునసాగర్ ఉప ఎన్నికలతో పాటు, గ్రాడ్యూయేట్‌లపై పెట్టింది. ఈ రెండు ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని ఇప్పటికే కసరత్తులు మొదలెట్టింది. అందులో భాగంగానే దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహరావు కుమార్తె, పీవీ వాణిదేవిని హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఖారారు చేసింది. అంతేగాకుండా స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆమెకు బీఫారం అందజేశారు. సీఎం కేసీఆర్ చేతుల బీఫారం అందుకున్న వాణిదేవి నేరుగా పార్టీ అనుచరులతో హైదరాబాద్ నెక్లెస్ రోడ్డునులోని పీవీ ఘాట్‌కు వెళ్లి, పుష్పగుచ్ఛం పెట్టి నివాళులు అర్పించారు.

అయితే.. సోమవారం నామినేషన్ వేయాలనుకున్న వాణిదేవికి చేదు అనుభవం ఎదురైంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వాణీదేవి నామినేషన్ వేయలేకపోయారు. ఇవాళ నామినేషన్ దాఖలు చేయడానికి వెళ్లిన ఆమెను రిటర్నింగ్ అధికారులు వెనక్కి పంపారు. నామినేషన్ పత్రాలు ఫార్మాట్‌లో లేకపోవడమే గాక, వాటిని సరిగా సమకూర్చుకోలేపోయారు. దాంతో దాదాపు నాలుగు పాటు రిటర్నింగ్ కార్యాలయంలోనే వాణీదేవి వేచి ఉండాల్సి వచ్చింది. అయినా ఫలితం లేకపోయింది. నామినేషన్ల స్వీకరణ సమయం అయిపోవడంతో ఆమె వెనుదిరగక తప్పలేదు. కాగా, రేపు(మంగళవారం) చివరి రోజు నామినేషన్ దాఖలు చేయనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి.



Next Story