- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వైజాగ్ అయినా ‘పుష్ప’కు కలిసొచ్చేనా?
<p>దిశ, వెబ్‌డెస్క్ : భారీ గ్యాప్ తర్వాత ‘అల వైకుంఠపురంలో’ సినిమా ద్వారా బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమా కోసం అభిమానులు వెయిట్ చేస్తున్నారు. అల వైకుంఠపురంలో తర్వాత ప్రకటించిన ‘పుష్ప’ సినిమాను త్వరగా సెట్స్ మీదకు తీసుకెళ్లాలని బన్నీ ఆశించినా సరే.. కరోనా కారణంగా అది కుదరలేదు. లాక్‌డౌన్ ఎత్తేశాక షూటింగ్ త్వరగా స్టార్ట్ చేయాలని అనుకున్నా.. పరిస్థితులు అనుకూలించలేదు. కేరళ, ఏపీలో షూటింగ్ పర్మిషన్స్, షూటింగ్ […]</p>

దిశ, వెబ్‌డెస్క్ :
భారీ గ్యాప్ తర్వాత ‘అల వైకుంఠపురంలో’ సినిమా ద్వారా బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమా కోసం అభిమానులు వెయిట్ చేస్తున్నారు. అల వైకుంఠపురంలో తర్వాత ప్రకటించిన ‘పుష్ప’ సినిమాను త్వరగా సెట్స్ మీదకు తీసుకెళ్లాలని బన్నీ ఆశించినా సరే.. కరోనా కారణంగా అది కుదరలేదు. లాక్‌డౌన్ ఎత్తేశాక షూటింగ్ త్వరగా స్టార్ట్ చేయాలని అనుకున్నా.. పరిస్థితులు అనుకూలించలేదు. కేరళ, ఏపీలో షూటింగ్ పర్మిషన్స్, షూటింగ్ స్పాట్స్ గురించే ఎక్కువ టైమ్ తీసుకుంది. అక్కడ, ఇక్కడ అంటూ కాలయాపన జరగ్గా.. ఫైనల్‌గా నవంబర్ 6 నుంచి పుష్ప చిత్రీకరణ ప్రారంభం కాబోతుంది. వైజాగ్‌లోని పలు ప్రాంతాల్లో షూటింగ్ చేయబోతున్నారు డైరెక్టర్ సుకుమార్.
కాగా ఇప్పటికే ‘పుష్ప’ నుంచి విడుదలైన బన్నీ రఫ్ లుక్ ఆకట్టుకోగా.. ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్‌లో తెరకెక్కుతోంది. శేషాచలం అడవుల్లో ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే సినిమాలో బన్నీ లారీ డ్రైవర్‌గా కనిపించనుండగా.. హీరోయిన్ రష్మిక మందన గిరిజన యువతిగా నటించనుంది. ప్రస్తుతం అల్లు అర్జున్ ఫ్యామిలీతో ఇంట్లోనే స్పెండ్ చేస్తుండగా.. తన ప్రాజెక్టులను కంప్లీట్ చేసే పనిలో ఉంది రష్మిక.






