తగ్గేదేలే.. 'పుష్ప' విలన్ డేంజరస్ లుక్ రివీల్

by  |
తగ్గేదేలే.. పుష్ప విలన్ డేంజరస్ లుక్ రివీల్
X

దిశ, సినిమా : మలయాళీ స్టార్ హీరో ఫాహద్ ఫాజిల్ పుట్టిన‌రోజు పురస్కరించుకుని ‘పుష్ప’ మూవీలో తను చేస్తున్న డేంజరస్ రోల్ టీజర్ లుక్ రిలీజ్ చేశారు మేకర్స్. అల్లు అర్జున్-రష్మిక మందన్న జంటగా డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్న చిత్రంలో ఫాహద్ విలన్ రోల్ పోషిస్తున్న సంగతి తెలిసిందే. నేడు తన 39వ బర్త్‌డే సందర్భంగా లుక్‌ రిలీజ్ చేసిన మైత్రీ మూవీ మేకర్స్.. సుప్రీం టాలెంటెడ్ హీరోకు విషెస్ తెలిపింది. ఈ ఫొటోపై “చెడు అంత ప్రమాదకరమైంది కాదు( EVIL WAS NEVER SO DENGEROUS)” అనే కొటేషన్ తన క్యారెక్టర్‌పై అంచనాలు పెంచేసింది.

నిజానికి ఫాహద్‌కు తెలుగులో ఇదే మొదటి సినిమా అయినా, విలన్ రోల్‌లో తన పర్ఫార్మెన్స్ చూసేందుకు ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాగా ఈ సినిమా ఐదు సౌత్ లాంగ్వేజెస్‌లో రెండు భాగాలుగా విడుదల కానుంది. ఇక ‘పుష్ప’ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఫస్ట్ పార్ట్.. క్రిస్మస్ సందర్భంగా రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.



Next Story

Most Viewed