సారీ ‘కిస్’కో హోనా?

by  |
సారీ ‘కిస్’కో హోనా?
X

కమల్ హాసన్ ఇండియన్ సినిమా సూపర్‌స్టార్. తనతో చేసిన దాదాపు అందరు హీరోయిన్లకు సినిమాలో ముద్దు పెట్టాడని అంటారు. అయితే ఇప్పుడు కమల్ హాసన్ కిస్ సీన్స్ గురించి సోషల్ మీడియాలో రచ్చ జరుగుతోంది. కమల్, రేఖ జంటగా నటించిన తమిళ సినిమా పున్నగై మన్నన్. కె.బాలచందర్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. 1986లో విడుదలైన ఈ సినిమా గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు రేఖ. ఆ సినిమాలో తన పర్మిషన్ లేకుండా కమల్ కిస్ చేసినట్లు తెలిపారు. అయితే అదంతా సినిమా కోసమే అని… నాకు చెప్తే ఒప్పుకోననే డైరెక్టర్, కమల్ అలా చేశారని తెలిపింది. ఈ ఇంటర్వ్యూ మీడియాలో ప్రసారం కాగా… కమల్ వెంటనే రేఖకు క్షమాపణ చెప్పాలంటూ సోషల్ మీడియాలో డిమాండ్ చేస్తున్నారు నెటిజన్లు.

దీనిపై స్పందించిన రేఖ అసలు ఇలా ఎందుకు జరుగుతుందో అర్థం కావడం లేదన్నారు. ఎప్పుడో జరిగిపోయిన దానికి ఇప్పుడు క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదన్నారు. సినిమాకు మంచి జరిగిందని, నాకు సారీ అవసరం లేదని తెలిపారు. సినిమాలు, సీరియళ్లు, వెబ్ సిరీస్‌లతో చాలా బిజీగా ఉన్నానని, నాకు బంధాలు, బాధ్యతలు ఉన్నాయన్నారు. ఈ సమయంలో ఇలా కమల్‌పై నిందవేసి పేరు తెచ్చుకోవాలనే ఆలోచన లేదని స్పష్టం చేశారు. దయచేసి ఈ విషయాన్ని ఇక్కడితో ఆపేస్తే బాగుంటుందని కోరారు.



Next Story

Most Viewed