- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘పుల్వామా’ టెర్రరిస్టు అరెస్టు!
by Shamantha N |
<p>న్యూఢిల్లీ : పుల్వామా దాడిలో ప్రమేయమున్న జైషే మొహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన టెర్రరిస్టును ఎన్ఐఏ అధికారులు శుక్రవారం అరెస్టు చేశారు. పుల్వామాలో నివసిస్తున్న ఫర్నీచర్ షాప్ ఓనర్.. షాకిర్ బషీర్ మాగ్రే గతేడాది పుల్వామాలో ఆత్మాహుతిదాడికి పాల్పడ్డ అదిల్ అహ్మద్ దార్‌కు ఆశ్రయంతోపాటు పలురకాలుగా సహకరించాడని అధికారులు తెలిపారు. పాకిస్తాన్ టెర్రరిస్టు మాగ్రేను మొహమ్మద్ ఉమర్ ఫరూఖ్.. అహ్మద్ దార్‌కు 2018లో పరిచయం చేయగా.. తర్వాత జైషే మొహమ్మద్‌లో చేరాడని వివరించారు. పుల్వామా దాడికి ఉపయోగించిన […]</p>

X
న్యూఢిల్లీ : పుల్వామా దాడిలో ప్రమేయమున్న జైషే మొహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన టెర్రరిస్టును ఎన్ఐఏ అధికారులు శుక్రవారం అరెస్టు చేశారు. పుల్వామాలో నివసిస్తున్న ఫర్నీచర్ షాప్ ఓనర్.. షాకిర్ బషీర్ మాగ్రే గతేడాది పుల్వామాలో ఆత్మాహుతిదాడికి పాల్పడ్డ అదిల్ అహ్మద్ దార్‌కు ఆశ్రయంతోపాటు పలురకాలుగా సహకరించాడని అధికారులు తెలిపారు. పాకిస్తాన్ టెర్రరిస్టు మాగ్రేను మొహమ్మద్ ఉమర్ ఫరూఖ్.. అహ్మద్ దార్‌కు 2018లో పరిచయం చేయగా.. తర్వాత జైషే మొహమ్మద్‌లో చేరాడని వివరించారు. పుల్వామా దాడికి ఉపయోగించిన కారులో పేలుడు పదార్థాన్ని అమర్చడంలోనూ మాగ్రే హస్తమున్నదని తెలిపారు. జమ్ములోని ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు ముందు మాగ్రేను శుక్రవారం హాజరుపరిచారు. పూర్తిస్థాయి దర్యాప్తు కోసం 15 రోజులు ఎన్ఐఏ కస్టడీలోకి రిమాండ్ తీసుకుంది.
Next Story






