రాధేశ్యామ్‌లో బుట్టబొమ్మ క్యారెక్టర్ అదేనా?

by  |
రాధేశ్యామ్‌లో బుట్టబొమ్మ క్యారెక్టర్ అదేనా?
X

పూజా హెగ్డే.. ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. నటించింది తక్కువ సినిమాలే కానీ, ప్రస్తుతం టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా కొనసాగుతూ వరుస ఆఫర్లను దక్కించుకుంటోంది. సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ బుట్టబొమ్మకు ఉండే ఫాలోయింగ్‌ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే. ఇక లాక్‌డౌన్‌తో ఇంటికే పరిమితమైన ఈ నటి అప్పుడప్పుడు తన ఫొటోలను కూడా అప్‌లోడ్ చేస్తుంటుంది. సంక్రాంతికి విడుదలైన అల వైకుంఠపురంలో సినిమాతో 2020ని మొదలెట్టిన పూజ.. ప్రస్తుతం ప్రభాస్‌, అఖిల్‌ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. తాజాగా ప్రభాస్ నటిస్తున్న చిత్రం ఫస్ట్‌లుక్‌ను రివీల్ చేసిన విషయం తెలిసిందే. ప్రభాస్, పూజ హెగ్డేలు.. రాధేశ్యామ్‌గా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. కాగా ఈ సినిమా ఫస్ట్ లుక్, టైటిల్స్.. అటు రెబల్ స్టార్ అభిమానులను, ఇటు పూజ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంది. హీరో ప్రభాస్‌తో పాటు ఫస్ట్ లుక్‌లోనే పూజను చూపించడంతో ఆమె పాత్రకు చాలా ప్రాముఖ్యత ఉన్నట్లుగా చెప్పకనే చెప్పారు.

రాధేశ్యామ్ సినిమాలో పూజా హెగ్డే మ్యూజిక్ టీచర్‌గా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. సినిమాలో ఆమె పాత్ర కథలో కీలకంగా ఉంటుందని ఫిల్మ్ నగర్ టాక్. రాధాకృష్ణ దర్శకత్వంలో పీరియాడిక్ రొమాంటిక్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ వారు నిర్మిస్తున్నారు. కాగా ఈ సినిమా వచ్చే ఏడాది సమ్మర్‌లో విడుదల అయ్యే అవకాశం ఉంది. రాధేశ్యామ్‌తో పాటు అఖిల్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ సినిమాలోనూ సందడి చేయనుంది పూజ. తాజాగా ఈ బ్యూటీ.. దుల్కర్‌ సల్మాన్‌ హీరోగా నటించనున్న సినిమాకు కూడా ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.



Next Story

Most Viewed