పుదుచ్చేరిలో నేడే బలపరీక్ష.. కాంగ్రెస్ నెగ్గేనా?

75

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో కాంగ్రెస్ సర్కార్ మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. వరుస రాజీనామాలతో కాంగ్రెస్‌కు షాక్‌లు తప్పడం లేదు. పుదుచ్చేరిలో కాంగ్రెస్ కూటమి బలం మైనార్టీలో ఉండగా.. తాజాగా మరో ఇద్దరు ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. నారాయణ స్వామి ప్రభుత్వం నేడు అసెంబ్లీలో బలపరీక్ష ఎదుర్కొవాల్సి ఉండగా.. బలపరీక్షకు ముందురోజు ఇద్దరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కూటమి నుంచి బయటి వచ్చారు.

పుదుచ్చేరి శాసనసభలో 30 స్థానాలుండగా గతంలో కాంగ్రెస్, డీఎంకే, స్వతంత్ర అభ్యర్థితో కలిపి 18 మంది సభ్యులతో నారాయణస్వామి నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు అయింది. ఇటీవల మంత్రి నమశివాయం, ఎమ్మెల్యే తీపాయన్ దాన్ రాజీనామా చేసి బీజేపీలో చేరారు. ఆ తర్వాత మరో ఇద్దరు ఎమ్మెల్యేలు మల్లాడి కృష్ణారావు, జాన్ కుమార్ కూడా రాజీనామా చేశారు. తాజాగా, మరో ఇద్దరు ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయడంతో కూటమి బలం 12కు పడిపోయింది. మరోవైపు ఎన్నార్‌ కాంగ్రెస్‌7, అన్నాడీఎంకే 4, బీజేపీకి 3.. వీరితో పాటు నామినేటెడ్ పదవులు మూడుతో ప్రత్యర్థి బలం 14గా ఉంది. సభలో ప్రస్తుతం సభ్యుల సంఖ్య 26కు చేరింది. 14 మంది సభ్యులుంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంద.

పుదుచ్చేరిలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం సోమవారం బలపరీక్షకు సిద్ధం కావాలని ఇప్పటికే లెఫ్టినెంట్‌ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో ఇవాళ సాయంత్రం 5 గంటలకు బలపరీక్ష జరగనుంది. విశ్వాస పరీక్ష అనే ఏకైక ఎజెండాతో జరిగే ఈ సమావేశంలో సభ్యులు చేతులెత్తి మద్దతు తెలపాలని తమిళిసై ఆదేశాలు ఇచ్చారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..