- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చిత్తూరు జిల్లాలో సైకో వీరంగం
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: ఏపీలోసైకోల బెడద ఎక్కువైంది. తాజాగా చిత్తూరు జిల్లాలో ఓ సైకో వీరంగం సృష్టించారు. వివరాల్లోకి వెళ్తే.. యాదమరి మండలం మాదిరెడ్డిపల్లెలో ఓ యువకుడు కనిపించిన వారిని అసభ్య పదజాలంతో దూషిస్తూ.. రోకలి బండతో దాడికి యత్నించాడు. దీంతో ప్రజలు భయపడి వీధుల వెంట పరుగులు తీశారు. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు అతి కష్టం మీద సైకోను అదుపులోకి తీసుకున్నారు. సైకో దాడిలో ఎస్ఐ సహా సిబ్బందికి స్వల్ప గాయాలయ్యాయి. సైకోతో పాటు […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ఏపీలోసైకోల బెడద ఎక్కువైంది. తాజాగా చిత్తూరు జిల్లాలో ఓ సైకో వీరంగం సృష్టించారు.
వివరాల్లోకి వెళ్తే.. యాదమరి మండలం మాదిరెడ్డిపల్లెలో ఓ యువకుడు కనిపించిన వారిని అసభ్య పదజాలంతో దూషిస్తూ.. రోకలి బండతో దాడికి యత్నించాడు. దీంతో ప్రజలు భయపడి వీధుల వెంట పరుగులు తీశారు. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు అతి కష్టం మీద సైకోను అదుపులోకి తీసుకున్నారు. సైకో దాడిలో ఎస్ఐ సహా సిబ్బందికి స్వల్ప గాయాలయ్యాయి. సైకోతో పాటు పోలీసుల సిబ్బంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సైకో పాత నేరస్తుడు సురేష్‌గా గుర్తించారు. సురేష్‌పై గతంలో కిడ్నాప్, హత్యాయత్నం వంటి కేసులు ఉన్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు.
Next Story






