ఖాళీ బిందెలతో పంచాయితీ కార్యాలయం ముందు నిరసన

by Sridhar Babu |   (  Updated:2021-08-07 04:30:55  IST  )

<p>దిశ, మణుగూరు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం సమితి సింగారం గ్రామపంచాయతీలో పదిహేను రోజుల నుండి మంచినీళ్లు రావడం లేదని గ్రామ ప్రజలు పంచాయతీ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం మండలంలోని మహిళలు పంచాయతీ కార్యాలయం ముందు ఖాళీ బిందెలతో  నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ.. పదిహేను రోజుల నుండి మంచినీళ్లు రావడం లేదని, ఎన్నో ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్ని సార్లు మంచినీళ్లు రావడం లేదని [&hellip;]</p>

ఖాళీ బిందెలతో పంచాయితీ కార్యాలయం ముందు నిరసన
X

దిశ, మణుగూరు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం సమితి సింగారం గ్రామపంచాయతీలో పదిహేను రోజుల నుండి మంచినీళ్లు రావడం లేదని గ్రామ ప్రజలు పంచాయతీ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం మండలంలోని మహిళలు పంచాయతీ కార్యాలయం ముందు ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ.. పదిహేను రోజుల నుండి మంచినీళ్లు రావడం లేదని, ఎన్నో ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్ని సార్లు మంచినీళ్లు రావడం లేదని పంచాయతీ అధికారులకు చెప్పినా అసలు పట్టించుకోవడం లేదని ప్రజలు మండిపడ్డారు.

పంచాయతీ అధికారులు నీటి సమస్యలను పట్టించుకోకపోవడంతోనే కార్యాలయం ముందు నిరసన తెలుపుతున్నామని మహిళలు తెలిపారు. ఇప్పటికైనా పంచాయతీ అధికారులు ప్రజల మంచినీటి సమస్యలను పరిష్కరించాలని అఖిలపక్ష సంఘాల నాయకులు, మహిళా సంఘాల నాయకులు, విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. లేని పక్షంలో పంచాయతీ కార్యాలయం ముందు భారీ ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు.

Next Story