బ్రేకింగ్.. Big Bossకు తెలంగాణ జాగృతి నిరసన సెగ

by Vadlamudi Anukaran |   (  Updated:2021-11-28 23:07:55  IST  )

<p>దిశ, వెబ్‌డెస్క్ : తెలుగు బిగ్ బాస్‌ షోకు మరోసారి నిరసన సెగ తగిలింది. బిగ్ బాస్-5 దాదాపుగా చివరి దశకు చేరుకున్న విషయం తెలిసిందే. 12 వారం నామినేషన్స్‌లో భాగంగా యాంకర్ రవి హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యాడు. దీంతో మరోసారి బిగ్ బాస్ ఓటింగ్‌పై రచ్చ మొదలైంది. రవి ఎలిమినేషన్‌‌ను జీర్ణించుకోలేని ఆయన ఫ్యాన్స్ నిరసనకు దిగారు. రవికి అన్యాయం జరిగిందంటూ సోమవారం ఉదయం తెలంగాణ జాగృతి కార్యకర్తలు నిరసనకు దిగారు. అన్నపూర్ణ స్టూడియో [&hellip;]</p>

బ్రేకింగ్.. Big Bossకు తెలంగాణ జాగృతి నిరసన సెగ
X

దిశ, వెబ్‌డెస్క్ : తెలుగు బిగ్ బాస్‌ షోకు మరోసారి నిరసన సెగ తగిలింది. బిగ్ బాస్-5 దాదాపుగా చివరి దశకు చేరుకున్న విషయం తెలిసిందే. 12 వారం నామినేషన్స్‌లో భాగంగా యాంకర్ రవి హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యాడు. దీంతో మరోసారి బిగ్ బాస్ ఓటింగ్‌పై రచ్చ మొదలైంది. రవి ఎలిమినేషన్‌‌ను జీర్ణించుకోలేని ఆయన ఫ్యాన్స్ నిరసనకు దిగారు.

రవికి అన్యాయం జరిగిందంటూ సోమవారం ఉదయం తెలంగాణ జాగృతి కార్యకర్తలు నిరసనకు దిగారు. అన్నపూర్ణ స్టూడియో దగ్గర తెలంగాణ జాగృతి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు నవీన్ గౌడ్ కార్యకర్తలతో ఆందోళన చేస్తున్నారు. ఈ సందర్భంగా బిగ్ బాస్‌లో ఎవరికి ఎన్ని ఓట్లు పడ్డాయో బహిరంగంగా ప్రకటించాలని నవీన్ డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా బిగ్ బాస్ నుండి ఎలిమినేట్ అయిన రవి.. కాసేపట్లో హౌస్ నుండి బయటకు రానున్నాడు.

Next Story